We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
అక్వాన్ తుఫాను నవంబర్ 20న ఆంధ్రప్రదేశ్ తీరం తాకే అవకాశం ఉందని అధికారులు సీఎం చంద్రబాబుకు వెల్లడించారు. కోస్తాంధ్రలోని పలు జిల్లాలపై ఈ తుఫాను ప్రభావం ఉండే అవకాశం ఉందని వారు తెలిపారు.
అక్వాన్ తుఫాను ఏపీ వైపు దూసుకొస్తోంది. నవంబర్ 20న తుఫాను తీరం తాకే అవకాశం ఉన్న క్రమంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు. RTGS సెంటర్ లో పరిస్థితిని పరిస్థితిని సమీక్షించిన ఆయన తక్షణమే అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.
బంగాళాఖాతంలో ప్రస్తుతం ఉన్న తీవ్రమైన అల్పపీడనం సోమవారం సాయంత్రానికి సైక్లోన్‌గా మారే అవకాశం ఉందని అధికారులు సీఎంకు వెల్లడించారు. నవంబర్ 19, 20 తేదీల్లో కోస్తాంధ్రలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, NTR, గుంటూరు జిల్లాలపై సైక్లోన్ ప్రభావం ఉండే అవకాశం ఉందని తెలిపారు అధికారులు.
అమరావతి: ఆగ్నేయ, నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. మీ దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. మీ వేగంతో ఉత్తర దిశగా కదిలిన వాయుగుండం.. రేపు తెల్లవారుజామున దక్షిణ, మధ్య పశ్చిమ బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశముందని పేర్కొన్నారు.
The India Meteorological Department (IMD) stated that a cyclonic circulation in the Bay of Bengal is expected to intensify into Cyclone Akvan by November 16.
అమరావతి: ఆగ్నేయ, నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. ప్రస్తుతం చెన్నైకి 840 కి.మీ, విశాఖకు 1,010 కి.మీ దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. వాయుగుండం తీవ్రత పెరిగి ఉత్తర-వాయవ్య దిశగా కదిలే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. గంటకు 10 కి.మీ వేగంతో ఉత్తర దిశగా కదిలిన వాయుగుండం.. రేపు తెల్లవారుజామున దక్షిణ, మధ్య పశ్చిమ బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశముందని పేర్కొన్నారు. తుపానుగా బలపడిన తర్వాత ఏపీ తీర ప్రాంతం వైపు వచ్చే అవకాశముందని తెలిపారు. దీంతో ఏపీ, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలకు అధికారులు తుపాను ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు.
తుపాను మరింత బలపడి ఈనెల 17న తీవ్ర తుపానుగా, 18న అతి తీవ్ర తుపానుగా మారే అవకాశముందన్నారు. దీని ప్రభావంతో 19 అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుతం కోస్తాంధ్రలోనే అతి తీవ్ర తుపానుగా తీరం దాటే అవకాశముందని అధికారులు స్పష్టం చేశారు. దీంతో కళింగపట్నం మినహా రాష్ట్రంలోని అన్ని పోర్టులకూ ఒకటో నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
Cyclone Akvan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో తుపాను గండం పొంచి ఉన్నది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలపడుతూ తీరంవైపు దూసుకొస్తున్నది. రెండు రోజులుగా ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారి ప్రస్తుతం ఆగ్నేయ, ఆ పక్కనే నైరుతి బంగాళాఖాతం ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నది. ఈ వాయుగుండం ఉత్తర-వాయవ్య దిశగా కదులుతూ మరింత బలపడనుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.
ఐఎండీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ వాయుగుండం రేపటికి (నవంబర్ 16 నాటికి) తుపానుగా మారనుంది. ఆ తర్వాత నవంబర్ 17 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా బలపడుతుంది. ఆ తర్వాత మరింత తీవ్రరూపం దాల్చి రాగల రెండు రోజుల్లో వాయవ్య దిశగా కదులుతూ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకురానుంది. ఇది తుపానుగా మారితే దీనిని ‘అక్వాన్’ తుపానుగా పిలువనున్నారు. ఈ తుపాను ప్రభావంతో నవంబర్ 19, 20 తేదీల్లో కోస్తాంధ్ర, యానాంలలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి.
బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం తుఫానుగా బలపడుతోంది. ఈ క్రమంలో తెలంగాణ, ఏపీకి ముప్పు పొంచి ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఈ తుఫాను అక్వాన్ అని పేరు పెట్టింది ఐఎండీ. ఈ తుపాను ఉత్తర-వాయువ్య దిశగా ప్రయాణించి నవంబర్ 20 నాటికి ఉత్తర కోస్తాంధ్ర తీరాన్ని దాటే ఉందని... దీని ప్రభావంతో నవంబర్ 20 నుంచి 22 వరకు తూర్పు తెలంగాణ, దక్షిణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. 21, 22 తేదీల్లో ఇతర జిల్లాల్లో కూడా తుపాను ప్రభావం ఉంటుందని తెలిపింది వాతావరణ శాఖ.
తుఫాను ప్రభావం ఏపీలోని కోస్తా తీరంపై ఎక్కువగా ఉంటుందని తెలిపింది వాతావరణ శాఖ. రానున్న 24 గంటల్లో తుఫానుగా బలపడనున్న వాయుగుండం మంగళవారం నాటికి తీవ్ర తుఫానుగా బలపడుతుందని తెలిపింది.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.