We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
NVIDIA CEO Jensen Huang is linked to a Chinese businesswoman, Alice Huang, amid rumors of an affair and espionage allegations. NVIDIA stated that their meetings were part of normal business relations.
Pawan – Anna | పవన్ కళ్యాణ్ -అన్నా కొణిదెల విడాకుల వార్తలతో ఫ్యాన్స్ హర్ట్.. పాత వీడియోలు వైరల్!
Entertainment — not analysed for political framing
Pawan – Anna | ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పాటు టాలీవుడ్‌లోనూ ఎప్పుడూ వార్తల్లో నిలిచే వ్యక్తి జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయన సినిమాలు, రాజకీయాలే కాకుండా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు కూడా తరచూ సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతుంటాయి. తాజాగా పవన్ కళ్యాణ్, ఆయన సతీమణి అన్నా కొణిదెల (అన్నా లెజినోవా) విడాకులు తీసుకున్నామంటూ ప్రకటించారు. ఈ వార్తలు అభిమానులను ఒక్కసారిగా షాక్‌కు గురిచేశాయి. అభిమానులు మాత్రం ఈ వార్తలు నిజం కాకపోతే బాగుండు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల మధ్య అనుబంధానికి సంబంధించిన పాత వీడియోలు ఇప్పుడు మరోసారి నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత చోటుచేసుకున్న ఓ సంఘటనను అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం పవన్ కళ్యాణ్ తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లి తల్లి, అన్నయ్య ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ సమయంలో అన్నా కొణిదెల భర్త చెప్పులను చేతులతో పట్టుకున్న దృశ్యం అప్పట్లో విపరీతంగా వైరల్ అయింది. ఆ వీడియోలో అన్నా చూపించిన ఆప్యాయత, భర్తపై ఆమెకు ఉన్న గౌరవాన్ని అభిమానులు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇప్పుడు…
Donald Trump stated that he might not resume attacks on Iran if a nuclear agreement is reached and the Strait of Hormuz is reopened, while warning he would not hesitate to strike if negotiations fail.
ప్రపంచంలోనే ప్రముఖ టెక్నాలజీ కంపెనీల్లో ఒకటైన ఎన్విడియా (NVIDIA) పేరు ఇప్పుడు ఒక సంచలన వివాదంతో వార్తల్లో నిలిచింది. ఈ కంపెనీ సీఈఓ జెన్సన్ హువాంగ్‌కు చైనాకు చెందిన ఆలిస్ హువాంగ్ అనే మహిళతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. అయితే ఈ వ్యవహారంలో అసలు వివాదం వారి వ్యక్తిగత సంబంధం మాత్రమే కాదు. ఆలిస్ హువాంగ్ చైనా తరఫున గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలు కూడా తెరపైకి వచ్చాయి. ఆమె ద్వారా అమెరికాకు చెందిన కీలకమైన ఏఐ (AI), సెమీకండక్టర్ టెక్నాలజీ సమాచారాన్ని చైనాకు చేరవేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమయ్యాయని కొన్ని వార్తా కథనాలు పేర్కొన్నాయి.
మరోవైపు, జెన్సన్ హువాంగ్‌కు వివాహేతర సంబంధం ఉందనే ప్రచారం కూడా ఈ వివాదానికి మరింత ప్రాధాన్యత తీసుకొచ్చింది. ఈ ఆరోపణలపై ఎన్విడియా స్పందిస్తూ, మా సీఈఓకు, ఆలిస్ హువాంగ్‌కు మధ్య జరిగిన సమావేశాలు సాధారణ వ్యాపార సంబంధాల్లో భాగమేనని తెలిపింది. అసలు ఈ ఆలిస్ హువాంగ్ ఎవరు? ఆమెకు జెన్సన్ హువాంగ్‌తో పరిచయం ఎలా ఏర్పడింది ? చైనా గూఢచారి అనే ఆరోపణలు ఎందుకు వచ్చాయి ? అంటే....
ఇంటర్నెట్‌డెస్క్: మధ్యంతర ఎన్నికల్లో ఓటమికి దారితీసిన పలు అంశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. ఇరాన్ (Iran)పై మళ్లీ దాడులు పునఃప్రారంభించకపోవచ్చని తాజాగా చెప్పారు. ప్రస్తుతం యుద్ధాన్ని ముగించేలా ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ (Donald Trump) స్పందించారు. అదే సమయంలో యుద్ధం చేసే ఆప్షన్‌ను కూడా తన వద్ద ఉంచుకున్నట్లు హెచ్చరించారు.
‘‘ఇరాన్ అణు కార్యక్రమం విషయంలో ఒప్పందం కుదిరి, హర్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకుంటే.. మళ్లీ ఆ దేశంపై దాడులు జరిగే అవకాశం చాలా తక్కువ. అదే సమయంలో చర్చలు విఫలమైతే మళ్లీ దాడులకు వెనకాడబోం. మా వద్ద మూడు విమాన వాహక నౌకలు సిద్ధంగా ఉన్నాయి. గంటల వ్యవధిలో ఇరాన్లో 38 వంతెనలను ధ్వంసం చేయగలం’’ అని ట్రంప్ వెల్లడించారు.
గోషామహల్, న్యూస్‌టుడే: వరి నారుతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిత్రాన్ని ఆవిష్కరించి కాంగ్రెస్ నేత మెట్టు సాయికుమార్ వినూత్నంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రైతు రుణమాఫీ అమలు చేసినందుకు కృతజ్ఞతగా రైతులు ప్రత్యేక అభిమానంతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ సమీపంలో ఉన్న మనోహరాబాద్‌లోని శ్రీరంగపురంలో రైతులు సుమారు 20 రోజులపాటు శ్రమించడంతో రేవంత్‌రెడ్డి చిత్రం రూపుదిద్దుకుందని ఒక ప్రకటనలో వివరించారు.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.