We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
The US House of Representatives rejected an impeachment motion against Defense Secretary Pete Hegseth by a vote of 211-204. In Russia-Ukraine peace talks mediated by the US, both countries agreed to a prisoner exchange but failed to reach a broader agreement to end the war.
Entertainment — not analysed for political framing
‘లెనిన్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు కన్నడ నటుడు ప్రమోద్. ఇప్పుడాయన హీరోగా ‘హల్కాడాన్’ సినిమా రాబోతుంది. కన్నడ, తుళు, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి చాల దర్శకత్వం వహిస్తున్నారు. మాసిస్ ప్రొడక్షన్స్ భాగస్వామ్యంతో శ్రీకాంత్ కె.పి, మాధవ్ సిరాన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అమృత అయ్యంగార్, రూపేశ్ శెట్టి ముఖ్యపాత్రధారులు. తాజాగా ఈ సినిమా తెలుగు టీజర్‌ని సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. పూర్తిగా యాక్షన్ నేపథ్యంలో ఉత్కంఠభరితంగా సాగుతున్న ఈ టీజర్లో మాస్ లుక్‌లో ప్రమోద్ కనిపించిన తీరు ఆకట్టుకుంది. త్వరలోనే ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేయనున్నట్టు తెలిపాయి…
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు భారీ ఊరట లభించింది. రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ను పదవి నుంచి తొలగించేందుకు ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం వీగిపోయింది. ఆ తీర్మానాన్ని ప్రతినిధుల సభ 211-204 ఓట్ల తేడాతో తిరస్కరించింది. ఇటీవల జరిగిన మధ్యంతర ఎన్నికల పరాభవం తర్వాత రిపబ్లికన్ పార్టీ ఈ విషయంలో ఐక్యతను ప్రదర్శించింది. తమ పార్టీకే చెందిన ఎంపీ థామస్ మాస్సీ తీసుకొచ్చిన ఈ తీర్మానంపై నేరుగా చర్చ లేదా, ఓటింగ్ జరగకుండా ట్రంప్ యంత్రాంగం వ్యూహాత్మకంగా అడ్డుకుంది. హెగ్సెత్ పదవికి ముప్పు రాకుండా వైట్‌హౌస్ సీనియర్ అధికారులు, రిపబ్లికన్ నాయకులు తెరవెనుక తీవ్రస్థాయిలో లాబీయింగ్…
NVIDIA CEO Jensen Huang is linked to a Chinese businesswoman, Alice Huang, amid rumors of an affair and espionage allegations. NVIDIA stated that their meetings were part of normal business relations.
దేశంలో జీవిత బీమా సంస్థల కొత్త వ్యాపార ప్రీమియం వసూళ్లు అక్టోబరులో 26% పెరిగాయి. 2025 ఇదే నెలలో రూ.34,007 కోట్లుగా ఉన్న వసూళ్లు, ఈసారి రూ.42,914 కోట్లకు చేరినట్లు జీవిత బీమా సంస్థల మండలి వెల్లడించింది. ఏక ప్రీమియం, సాధారణ ప్రీమియం పాలసీల విక్రయాలు పెరగడం ఇందుకు దోహదం చేసింది. ప్రభుత్వ జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) కొత్త ప్రీమియం వసూళ్లు రూ.19,274 కోట్ల నుంచి 31% వృద్ధితో రూ.25,316 కోట్లకు చేరాయి. ప్రైవేటు రంగంలోని 26 జీవిత బీమా సంస్థల వసూళ్లు రూ.14,733 కోట్ల నుంచి 20% పెరిగి రూ.17,599 కోట్లకు చేరాయి. ప్రైవేటు బీమా సంస్థల్లో వ్యక్తిగత సింగిల్ ప్రీమియం…
Anirudh-Kavya | అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి వార్తల్లో కొత్త ట్విస్ట్.. గ్రీస్‌లో పెళ్లి అంటూ వైరల్, అసలు నిజం ఇదేనా?
Entertainment — not analysed for political framing
Anirudh-Kavya | సౌత్ ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీలో తనదైన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో మార్మోగుతోంది. దీనికి కారణం ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త. సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కుమార్తె, సన్‌రైజర్స్ హైదరాబాద్ క్రికెట్ జట్టు సీఈఓ కావ్య మారన్‌తో అనిరుధ్ వివాహం జరగబోతోందంటూ గత కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. తాజాగా వీరిద్దరి పెళ్లి గ్రీస్ దేశంలో అత్యంత ఘనంగా జరిగినట్లు కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో అభిమానుల్లో ఒక్కసారిగా ఆసక్తి పెరిగింది. అయితే ఈ వివాహానికి సంబంధించి…
అనిరుధ్, కావ్య మారన్ వివాహం గ్రీస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్‌గా జరిగిందంటూ కొన్ని కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. ఇరు కుటుంబాలకు చెందిన సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వేడుకను అత్యంత ప్రైవేట్‌గా నిర్వహించడంతో ఫొటోలు, వీడియోలు బయటకు రాలేదనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ వివాహానికి సూపర్ స్టార్ రజనీకాంత్‌తో పాటు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కుటుంబ సభ్యులు హాజరైనట్లు కూడా కొన్ని కథనాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ వివరాలకు సంబంధించి అధికారిక ధృవీకరణ లేదు. అనిరుధ్ లేదా కావ్య మారన్ కుటుంబ సభ్యులు ఈ వార్తలపై స్పందించకపోవడంతో అభిమానుల్లో ఉత్కంఠ…
Pawan – Anna | పవన్ కళ్యాణ్ -అన్నా కొణిదెల విడాకుల వార్తలతో ఫ్యాన్స్ హర్ట్.. పాత వీడియోలు వైరల్!
Entertainment — not analysed for political framing
Pawan – Anna | ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పాటు టాలీవుడ్‌లోనూ ఎప్పుడూ వార్తల్లో నిలిచే వ్యక్తి జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయన సినిమాలు, రాజకీయాలే కాకుండా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు కూడా తరచూ సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతుంటాయి. తాజాగా పవన్ కళ్యాణ్, ఆయన సతీమణి అన్నా కొణిదెల (అన్నా లెజినోవా) విడాకులు తీసుకున్నామంటూ ప్రకటించారు. ఈ వార్తలు అభిమానులను ఒక్కసారిగా షాక్‌కు గురిచేశాయి. అభిమానులు మాత్రం ఈ వార్తలు నిజం కాకపోతే బాగుండు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల మధ్య అనుబంధానికి సంబంధించిన పాత వీడియోలు ఇప్పుడు మరోసారి నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత చోటుచేసుకున్న ఓ సంఘటనను అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం పవన్ కళ్యాణ్ తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లి తల్లి, అన్నయ్య ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ సమయంలో అన్నా కొణిదెల భర్త చెప్పులను చేతులతో పట్టుకున్న దృశ్యం అప్పట్లో విపరీతంగా వైరల్ అయింది. ఆ వీడియోలో అన్నా చూపించిన ఆప్యాయత, భర్తపై ఆమెకు ఉన్న గౌరవాన్ని అభిమానులు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇప్పుడు…
ప్రపంచంలోనే ప్రముఖ టెక్నాలజీ కంపెనీల్లో ఒకటైన ఎన్విడియా (NVIDIA) పేరు ఇప్పుడు ఒక సంచలన వివాదంతో వార్తల్లో నిలిచింది. ఈ కంపెనీ సీఈఓ జెన్సన్ హువాంగ్‌కు చైనాకు చెందిన ఆలిస్ హువాంగ్ అనే మహిళతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. అయితే ఈ వ్యవహారంలో అసలు వివాదం వారి వ్యక్తిగత సంబంధం మాత్రమే కాదు. ఆలిస్ హువాంగ్ చైనా తరఫున గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలు కూడా తెరపైకి వచ్చాయి. ఆమె ద్వారా అమెరికాకు చెందిన కీలకమైన ఏఐ (AI), సెమీకండక్టర్ టెక్నాలజీ సమాచారాన్ని చైనాకు చేరవేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమయ్యాయని కొన్ని వార్తా కథనాలు పేర్కొన్నాయి.
మరోవైపు, జెన్సన్ హువాంగ్‌కు వివాహేతర సంబంధం ఉందనే ప్రచారం కూడా ఈ వివాదానికి మరింత ప్రాధాన్యత తీసుకొచ్చింది. ఈ ఆరోపణలపై ఎన్విడియా స్పందిస్తూ, మా సీఈఓకు, ఆలిస్ హువాంగ్‌కు మధ్య జరిగిన సమావేశాలు సాధారణ వ్యాపార సంబంధాల్లో భాగమేనని తెలిపింది. అసలు ఈ ఆలిస్ హువాంగ్ ఎవరు? ఆమెకు జెన్సన్ హువాంగ్‌తో పరిచయం ఎలా ఏర్పడింది ? చైనా గూఢచారి అనే ఆరోపణలు ఎందుకు వచ్చాయి ? అంటే....
ఇంటర్నెట్‌డెస్క్: మధ్యంతర ఎన్నికల్లో ఓటమికి దారితీసిన పలు అంశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. ఇరాన్ (Iran)పై మళ్లీ దాడులు పునఃప్రారంభించకపోవచ్చని తాజాగా చెప్పారు. ప్రస్తుతం యుద్ధాన్ని ముగించేలా ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ (Donald Trump) స్పందించారు. అదే సమయంలో యుద్ధం చేసే ఆప్షన్‌ను కూడా తన వద్ద ఉంచుకున్నట్లు హెచ్చరించారు.
‘‘ఇరాన్ అణు కార్యక్రమం విషయంలో ఒప్పందం కుదిరి, హర్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకుంటే.. మళ్లీ ఆ దేశంపై దాడులు జరిగే అవకాశం చాలా తక్కువ. అదే సమయంలో చర్చలు విఫలమైతే మళ్లీ దాడులకు వెనకాడబోం. మా వద్ద మూడు విమాన వాహక నౌకలు సిద్ధంగా ఉన్నాయి. గంటల వ్యవధిలో ఇరాన్లో 38 వంతెనలను ధ్వంసం చేయగలం’’ అని ట్రంప్ వెల్లడించారు.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.