We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
బిట్‌కాయిన్ విలువ రెండేళ్ల కనిష్ఠానికి చేరిందని, అమెరికా మరియు ఆసియా మార్కెట్లలో పడిపోయి 55,533 డాలర్లకు పరిమితమైందని ఈ వార్త నివేదించింది. కోకింగ్ కోల్ నిల్వలు పరిమితంగా ఉన్నాయని, దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోందని టాటా స్టీల్ సీఈఓ టీవీ నరేంద్రన్ పేర్కొన్నారు.
ప్రపంచంలో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ అయిన బిట్‌కాయిన్ విలువ రెండేళ్ల కనిష్ఠానికి చేరింది. శుక్రవారం అమెరికా మార్కెట్లో 6 శాతం, శనివారం ఆసియా మార్కెట్లో మరో 5.7 శాతం పతనమై 55,533 డాలర్లకు పరిమితమైంది. 2024 సెప్టెంబరు తర్వాత దీని విలువ ఇదే అత్యల్పం కావడం గమనార్హం. గతేడాది అక్టోబరులో 1,26,000 డాలర్ల వద్ద గరిష్ఠ స్థాయికి చేరిన బిట్‌కాయిన్, ఏడాది వ్యవధిలోనే ఏకంగా 70,000 డాలర్లకు పైగా పడిపోయింది. మొత్తం క్రిప్టో మార్కెట్ విలువ 7.58% తగ్గి 1.95 ట్రిలియన్ డాలర్లకు పరిమితమైనట్లు కాయిన్ మార్కెట్ క్యాప్ తెలిపింది. క్రిప్టో కరెన్సీ నిబంధనలు సడలిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గతంలో సంకేతాలు…
జ్యోతిష్య పండితులు తెలిపిన ప్రకారం, కార్తీక మాసంలో తులసి కళ్యాణం చేయడం వల్ల పెళ్లికాని పిల్లలకు మూడు నెలల్లో పెళ్లి సంబంధం కుదురుతుందని చెబుతున్నారు. ఈ పర్వదినం 2026 నవంబర్ 21, శనివారం నాడు వస్తుందని వివరిస్తూ, ఈ వేడుకను ఎలా నిర్వహించాలో ఈ కథనం వివరిస్తుంది.
Rohit Sharma: ఆ వార్త విని ఉక్కిరిబిక్కిరి అయ్యా: రోహిత్ శర్మ
Not analysed for framing
Rohit Sharma | ఇంటర్నెట్ డెస్క్: భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma Host) ఇప్పుడు హోస్ట్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజా ఎపిసోడ్లో తన టీమ్ఇండియా ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వాంఖడే మైదానంలో తన పేరిట స్టాండ్ ఉండటంపై కాస్త భావోద్వేగానికి గురయ్యాడు. కుటుంబం గర్వంగా ఫీలైన సంఘటన ఏమిటని ఓ కంటెస్ట్ అడిగిన ప్రశ్నకు రోహిత్ సమాధానం ఇచ్చాడు. బీసీసీఐ నుంచి టీమ్ఇండియాకు ఎంపికైనట్లు వచ్చిన కాల్‌ను ఎప్పటికీ మరిచిపోలేనని గుర్తు చేసుకున్నాడు.
‘‘కెరీర్లో తొలిసారి భారత జట్టుకు ఎంపిక కావడం నాకు గుర్తుండి పోతుంది. అప్పుడు నేను బెంగళూరులో ఉన్నా. జట్టును సెలక్ట్ చేస్తున్నారని తెలుసు. నా ప్రాక్టీస్‌ను ముగించుకుని నా హోటల్ గదికి వెళ్లా. కళ్లన్నీ నా ఫోన్‌పైనే ఉన్నాయి. శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉండిపోయా. ఫోన్ కాల్స్ ఎక్కువగా రాలేదంటే మాత్రం ఎంపిక కాలేదని అర్థం. ఎప్పుడు రింగ్ అవుతుందా అని వేచి చూస్తూ ఉన్నా. అప్పటికి మధ్యాహ్నం దాటింది. కునుకు పట్టలేదు. ఫోన్ దగ్గరే కూర్చుని ఉన్నా. సాయంత్రం ఐదు గంటల సమయంలో ఫోన్ రింగ్ అయితే వెంటనే ఎత్తేశా. టీమ్ఇండియాకు ఎంపికైనట్లు బోర్డు నుంచి సమాచారం వచ్చింది. ఆ మాట వినగానే ఉక్కిరిబిక్కిరి అయ్యా.…
పిల్లలకు పెళ్లి వయసు వచ్చినా సంబంధం కుదరకపోవడం తల్లిదండ్రులకు పెద్ద బాధ. ఎన్ని సంబంధాలు చూసినా ఏదో ఒక కారణంతో వెనక్కి పోవడం, చూసిన వాళ్లు నచ్చకపోవడం, నచ్చిన వాళ్లు వద్దనడం.. ఇలా ఏళ్లు గడిచిపోతుంటే ఇంట్లో టెన్షన్ పెరిగిపోతుంది. అలా టెన్షన్పడే తల్లిదండ్రులు కార్తీక శుక్ల పక్షంలోని ద్వాదశి తిథి తులసీ కళ్యాణం చేస్తే ఓ మూడు నెలల్లో ఇంట్లో పెళ్లి బాజాలు మోగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అలాంటి పవిత్రమైన రోజు ఈ ఏడాది ఎప్పుడు వచ్చింది.. ఎలా కళ్యాణం చేయాలి.. పూజా విధానం ఏమిటి.. మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
పెళ్లి సంబంధం కుదిరేందుకు ఆటంకాలు వస్తుంటే మన పెద్దలు చెప్పే అద్భుత పరిష్కారమే తులసి కళ్యాణం. కార్తీక మాసంలో ఒక్కసారి భక్తితో ఈ కళ్యాణం జరిపిస్తే చాలు, 3 నెలల్లోనే ఇంట్లో శుభవార్త వినిపిస్తుందని పండితులు గట్టిగా చెబుతున్నారు. పెళ్లి కావలసిన పిల్లల తల్లి దండ్రులు వారి పేరున జరిపించాలని పురాణాల ద్వారా తెలుస్తుంది.
న్యూఢిల్లీ: గత కొన్ని నెలలుగా పడుతూ వస్తున్న బంగారం ధరలు, బుధవారం 14 నెలల కనిష్టాన్ని నమోదు చేశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింత పెంచే అవకాశం ఉందన్న అంచనాలకు తోడు, డాలర్ బలపడటం, అమెరికా బాండ్ ఈల్డ్స్ 5 శాతం పైన కొనసాగడం పసిడిపై తీవ్ర ఒత్తిడి పెంచాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర బుధవారం రూ. 2,780 తగ్గి రూ. 1,33,260 కి చేరింది.
కిందటేడాది సెప్టెంబర్ తర్వాత ఇదే కనిష్ట స్థాయి. అంతర్జాతీయ స్పాట్ మార్కెట్లో ఔన్సు (దాదాపు 28 గ్రాముల) బంగారం ధర 3,773 డాలర్ల స్థాయికి దిగొచ్చింది. ఈ ఏడాది జనవరిలో గోల్డ్ ధరలు 10 గ్రాములకు రూ.1.80 లక్షల దగ్గర ఆల్ టైమ్ హై నమోదు చేసింది. ప్రస్తుతం రూ.1.33 లక్షల నుంచి రూ.1.37 లక్షలు పలుకుతోంది. ఇది దాదాపు 23 శాతం తగ్గుదల.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.