We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
టాటా సన్స్ బోర్డు సమావేశం స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్ అంశంపై చర్చించేందుకు ఈనెల 26 నుంచి 30కి వాయిదా పడింది, నోయల్ టాటా లేఖ వల్లే ఈ మార్పు జరిగిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దిల్లీ మెట్రో ప్రయాణికుల కోసం ఉబర్ ‘కనెక్టెడ్ జర్నీస్’ను తీసుకొచ్చింది.
Entertainment — not analysed for political framing
‘కొత్త అవతారం.. కొత్త చాప్టర్‌తో కూడిన సరికొత్త ప్రపంచం’ అనే వ్యాఖ్యతో ఇటీవల మలయాళ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి.. ఆయన ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతున్న ‘మేళా’ చిత్రాన్ని ప్రకటించారు. నితీశ్ సహదేవ్ దర్శకత్వం వహిస్తున్నారు. మమ్ముట్టి కంపెనీ నిర్మిస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ చిత్ర రచయిత అనురాజ్ ఈ సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్టు వెల్లడించారు. మాస్ యాక్షన్ జానర్లో ఈ చిత్రం ముస్తాబవుతుందని, త్వరలోనే చిత్రీకరణ పూర్తవనుందని తెలిపారు. ఇప్పటికే రాజ్‌కుమార్ పెరియసామి తెరకెక్కించిన ‘ఓ.ం’ సినిమాలో కార్తికేయన్‌గా థియేటర్లలో…
ముంబయి: టాటా సన్స్ బోర్డు సమావేశం ఈనెల 26 నుంచి 30కి వాయిదా పడింది. స్టాక్ ఎక్స్ఛేంజీల్లో టాటా సన్స్ లిస్టింగ్ అంశంపై చర్చించనున్న నేపథ్యంలో, ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. బోర్డు సమావేశం కోసం 7 రోజుల గడువుతో నోటీసు ఇవ్వాల్సి ఉన్నా, 4 రోజుల ముందే అజెండా ప్రకటించారంటూ టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ నోయల్ టాటా లేఖ రాయడం వల్లే ఈ సమావేశాన్ని వాయిదా వేశారు. సమావేశ అజెండాలో మార్పు చేయలేదని, డైరెక్టర్లందరూ సమావేశానికి సిద్ధం అయ్యేలా చూసేందుకే తేదీని మార్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచనలు పాటించేందుకు అవసరమైన కార్యాచరణపైనా చర్చించనున్నారు.
శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో పాతకక్షల నేపథ్యంలో ఎంఐఎం నాయకుడు, మాజీ రౌడీషీటర్ మూర్తుజ అలీ దారుణ హత్యకు గురయ్యాడు.
శంషాబాద్ రూరల్, నవంబర్ 23 : పాతకక్షలు, ప్రత్యర్థుల మధ్య ఆధిపత్యపోరు నేపథ్యంలో ఎంఐఎం నాయకుడు, మాజీ రౌడీషీటర్ మూర్తుజ అలీ(మూర్తుజ పైల్వాన్) దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన మాజీ రౌడీషీటర్ మూర్తుజ అలీ పలు కేసుల్లో నిందితుడు. 2015లో మీరాలం ట్యాంక్ వద్ద జరిగిన ఓ హత్య కేసులో, 2021లో మరో హత్య కేసులో అతడి పేరు ప్రధానంగా ఉన్నట్టు సమాచారం.
పాతకక్షల నేపథ్యంలో సోమవారం సాయంత్రం హిమాయత్‌సాగర్ సమీపంలోని కొత్వాల్‌గూడ ఏకోపార్కు వద్ద ఉన్న అతడిపై గుర్తు తెలియని దుండగులు కత్తులు, తల్వార్లతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతడిని అత్తాపూర్‌లోని ఓ ప్రైయివేటు దవాఖానకు తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మూర్తుజ అలీ హత్యకు గురైన విషయం తెలుసుకున్న ఆయన అనుచరులు ఆసుపత్రి వద్దకు భారీగా చేరుకున్నారు. దీంతో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/11/2026)
Not analysed for framing
శుభసంకల్పాలు కార్యరూపం దాల్చే సూచనలు ఉన్నాయి. మీ వ్యక్తిగతప్రతిభతో కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను చక్కదిద్దుకుంటారు. విద్యా సంబంధ విషయాల్లో ఉత్సాహకరమైన పరిణామాలు ఉంటాయి. ఆదాయానికి సంబంధించిన కొత్త సమాచారం అందుతుంది. ఉద్యోగంలో విధి నిర్వహణకు ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఆర్థిక సంబంధ నిర్ణయాల్లో విచక్షణ పాటించాలి. మీ ధైర్యసాహసాలు విజయానికి ఉపకరిస్తాయి. శని ధ్యానశ్లోక పారాయణం శ్రేయస్కరం.
కార్యనిర్వహణలో సముచితమైన జాగ్రత్తలు పాటిస్తారు. ఉద్యోగంలో మీ సేవలకు తగిన ఆదరణ లభిస్తుంది. వ్యాపారంలో పోటీ పరిస్థితులను చాకచక్యంగా ఎదుర్కొంటారు. కొత్త ఆదాయ మార్గాలను పరిశీలిస్తారు. గృహ సంబంధ వ్యవహారాల్లో కొన్ని మార్పులు అవసరం అవుతాయి. ధనవ్యయాన్ని నియంత్రించుకోవడం మంచిది. మీ అనుభవం, సహనం క్లిష్టమైన విషయాలకు పరిష్కారం చూపుతాయి. ఈశ్వర అభిషేక దర్శనం శుభప్రదం.
ప్రపంచంలో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ అయిన బిట్‌కాయిన్ విలువ రెండేళ్ల కనిష్ఠానికి చేరింది. శుక్రవారం అమెరికా మార్కెట్లో 6 శాతం, శనివారం ఆసియా మార్కెట్లో మరో 5.7 శాతం పతనమై 55,533 డాలర్లకు పరిమితమైంది. 2024 సెప్టెంబరు తర్వాత దీని విలువ ఇదే అత్యల్పం కావడం గమనార్హం. గతేడాది అక్టోబరులో 1,26,000 డాలర్ల వద్ద గరిష్ఠ స్థాయికి చేరిన బిట్‌కాయిన్, ఏడాది వ్యవధిలోనే ఏకంగా 70,000 డాలర్లకు పైగా పడిపోయింది. మొత్తం క్రిప్టో మార్కెట్ విలువ 7.58% తగ్గి 1.95 ట్రిలియన్ డాలర్లకు పరిమితమైనట్లు కాయిన్ మార్కెట్ క్యాప్ తెలిపింది. క్రిప్టో కరెన్సీ నిబంధనలు సడలిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గతంలో సంకేతాలు…
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.