We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
హైదరాబాద్ నగరంలో కొన్ని ఆటో ఫైనాన్స్ సంస్థలు అత్యధిక వడ్డీలతో రుణాలు అందించి నిబంధనలకు విరుద్ధంగా దందా చేస్తున్నాయని ఆటో డ్రైవర్లు విమర్శిస్తున్నారు. కొన్ని ఆటో సంఘాలు ఫైనాన్స్ సంస్థలకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ ఆర్టీఏ అధికారులపై ఒత్తిడి తెస్తున్నాయని ఈ కథనం పేర్కొంది.
సిటీబ్యూరో, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ) : తొండ ముదిరితే ఊసరవెల్లి అయినట్టు డ్రైవర్ల సమస్యలపై తొలుత పోరాటం చేసి.. అదే డ్రైవర్లను బలిచేసే ఫైనాన్స్ సంస్థలకు విశ్వాసంగా పనిచేస్తున్న కొన్ని ఆటో సంఘాల వ్యవహారంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఫైనాన్స్ సంస్థలకు కొన్ని ఆటో యూనియన్లు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే ఆటో ఫైనాన్స్ సంస్థల ఆగడాలు మితిమీరిపోతున్నా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమవుతున్నది. నగరంలో ఆటో విక్రయాల్లో కొన్ని ఫైనాన్స్ నిర్వాహకులు అత్యధిక వడ్డీలతో రుణాలు అందించి నిబంధనలకు విరుద్ధంగా దందా చేస్తున్నారు. ఆ కిస్తీలు చెల్లించలేక…
09 శాతానికి పెరిగిందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇంధనం, విద్యుత్ మరియు ఆహార పదార్థాల ధరల పెరుగుదల దీనికి ప్రధాన కారణమని నివేదిక పేర్కొంది.
భారత ఆర్థిక వ్యవస్థను ద్రవ్యోల్బణం వెంటాడుతోంది. అక్టోబర్ 2026 నెలలో హోల్సేల్ ద్రవ్యోల్బణం(WPI) ఊహించని విధంగా పెరిగింది. సెప్టెంబరులో 11.39 శాతంగా ఉన్న హోల్సేల్ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం.. అక్టోబర్ నాటికి ఏకంగా 12.29 శాతానికి దూసుకెళ్లింది. ఇంధనం, ఎలక్ట్రిసిటీ, ఆహార పదార్థాలు, మినరల్స్ ధరలు ఒక్కసారిగా పెరగడంతోనే ఈ పరిస్థితి తలెత్తినట్లు వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.
ముఖ్యంగా దేశంలో ఫ్యూయెల్ అండ్ పవర్ ద్రవ్యోల్బణం అత్యధికంగా 32.84 శాతానికి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అంతకుముందు సెప్టెంబర్లో ఇది 25.85 శాతంగా మాత్రమే ఉండేది. ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు, సహజ వాయువు, విద్యుత్ ధరల పెరుగుదల ఇంధన ద్రవ్యోల్బణాన్ని పైకి లాగింది. మరోవైపు ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం 8.26 శాతానికి చేరగా, నాన్-ఫుడ్ ఆర్టికల్స్ 11.69 శాతానికి, మినరల్స్ ద్రవ్యోల్బణం ఏకంగా 12.64 శాతానికి ఎగబాకాయి. తయారీ రంగం మాత్రం 9.54 శాతానికి తగ్గి కొంతమేర ఊరటనిచ్చింది.
RBI Interest Rate | ముంబై, నవంబర్ 14: రిజర్వ్ బ్యాంక్ డిసెంబర్ సమీక్షలోనూ వడ్డీరేటును 0.25 శాతం పెంచవచ్చని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక పరిశోధన విభాగం అంచనా వేసింది. గతంలో చెప్పిన 0.50 శాతం పెంపు అంచనాను సగానికి తగ్గించింది. బాహ్య పరిస్థితులు మెరుగుపడటం, విదేశీ నిధుల ప్రవాహం మళ్లీ పెరగటం, రూపాయిపై ఒత్తిడి తగ్గడం వల్లే అంచనాను సవరించినట్లు వెల్లడించింది. రిజర్వుబ్యాంక్ నిర్దేశించిన 6 శాతం కంటే అధికంగా ద్రవ్యోల్బణం నమోదైనప్పటికీ ఈ అంచనాను సవరించడం విశేషం. ప్రస్తుత వడ్డీరేటు పెంపు డిసెంబర్లోది చివరిది అయ్యే అవకాశం ఉన్నదని తన నివేదికలోతెలిపింది.
దాదాపు నాలుగేండ్ల తర్వాత సెంట్రల్ బ్యాంక్ అక్టోబర్లో కీలక పాలసీ రేటును 0.25 శాతం పాయింట్లు పెంచి 5.50 శాతానికి చేర్చింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, బలహీనపడిన రూపాయి, అధిక ముడిచమురు ధరల మధ్య మరిన్ని వడ్డీరేట్ల పెంపులు ఉండవచ్చని అప్పట్లో సంకేతాలిచ్చింది. నవంబర్లో ద్రవ్యోల్బణం 6 శాతానికి పైకి చేరుకునే అవకాశం ఉన్నప్పటికీ, ఆ తర్వాత తగ్గుతుందని తన నివేదికలో వెల్లడించింది.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.