We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
Heavy and continuous rainfall in Tirumala has caused severe difficulties for devotees visiting the Venkateswara temple. Temple surroundings and streets are waterlogged, and devotees, including children and the elderly, are facing extreme inconvenience.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామివారి క్షేత్రం అయిన తిరుమల కొండపై కుండపోత వర్షం పడుతుంది. 12 గంటలుగా ఆగకుండా పడుతున్నది వర్షం. భారీ వర్షంతో శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు శ్రీవారి దర్శనం కోసం ఆలయానికి వెళ్తున్న భక్తులు... మరోవైపు స్వామివారి దర్శనం ముగించుకుని ఆలయం వెలుపలకు వస్తున్న భక్తులు వర్షంలో తడిసి ముద్దవుతున్నారు. అయినప్పటికీ గోవింద నామస్మరణతో భక్తులు స్వామివారి దర్శనానికి తరలివెళ్తున్నారు.
తిరుమల క్షేత్రాన్ని భారీ వర్షం ముంచెత్తుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో తిరుమలలోని ఆలయ పరిసరాలు, మాడవీధులు జలమయం అయ్యాయి. శ్రీవారి దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు వర్షం కారణంగా తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులతో కలిసి తిరుమలకు వచ్చిన కుటుంబాలు వర్షంలో ఇబ్బందులు పడుతున్నాయి.
4 centimeters of heavy rainfall, bringing relief from the summer heat. It details the rainfall measurements across various mandals in the district over the past three days.
IND vs WI ఐదో టీ20కి వర్షం దెబ్బ.. 9 ఓవర్లకు మ్యాచ్ కుదింపు.. టాస్ గెలిచిన విండీస్.. ఇండియా ఫస్ట్ బ్యాటింగ్
Analysis pending
IND vs WI 5th T20: భారత గడ్డపై క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్న భారత్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ క్లైమాక్స్ కు చేరుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సిన ఈ సిరీస్ డిసైడర్ మ్యాచ్‌కు ముందు భారీ వర్షం తీవ్ర అంతరాయం కలిగించినప్పటికీ, ఎట్టకేలకు వాన తగ్గడంతో గ్రౌండ్ సిబ్బంది మైదానాన్ని సిద్ధం చేశారు. రెండు గంటలకు పైగా కురిసిన వర్షపు విరామం తర్వాత మ్యాచ్‌ని 9 ఓవర్ల చొప్పున నిర్వహించాలని అంపైర్లు నిర్ణయించారు.
రాత్రి 9:00 గంటలకు వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నాడు. ఇక మ్యాచ్ రాత్రి 9:15 గంటలకు స్టార్ట్ కానుంది. పూర్తి 20 ఓవర్ల నుంచి మ్యాచ్‌ను ఇరుజట్లకు 9 ఓవర్లకు మాత్రమే కుదించారు. ఇక మొదటి 2.4 ఓవర్ల పాటు పవర్‌ప్లే అమల్లో ఉంటుంది. నలుగురు బౌలర్లు గరిష్టంగా 2 ఓవర్ల చొప్పున బౌలింగ్ చేయాల్సి ఉండగా, మరో ఐదు బౌలర్ లేదా మిగతా ఆప్షన్ కింద ఒక బౌలర్ కేవలం 1 ఓవర్ మాత్రమే వేసేందుకు అవకాశం ఉంటుంది.
IND vs WI 5th T20: భారత్ వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగాల్సిన ఐదో టీ20 (సిరీస్ డిసైడర్) మ్యాచ్‌కు వర్షం శత్రువుగా మారింది. ఈరోజు (2026, అక్టోబర్ 17, శనివారం) సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షం వల్ల రాత్రి 7:00 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ టాస్ ఇంకా పడలేదు. ఈ క్రమంలో మ్యాచ్ నిర్వహణ, ఓవర్ల కోతకు సంబంధించి ఐసీసీ నియమావళి ప్రకారం కటాఫ్ టైమింగ్స్ ఖరారయ్యాయి.
* ఓవర్ల కోత ప్రారంభం (7:30 PM / 7:45 PM): మ్యాచ్ ప్రారంభ సమయం (7:00 PM) నుంచి బఫర్ టైమ్ దాటినందున, ఇప్పటి నుంచే మ్యాచ్ నిర్వహిస్తే ఓవర్ల సంఖ్య తగ్గనుంది.
India vs West Indies 5th T20: భారత్ వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగాల్సిన ఐదో టీ20 (సిరీస్ డిసైడర్) మ్యాచ్‌కు వర్షం పెద్ద అడ్డంకిగా మారింది. చిన్నస్వామి పరిసర ప్రాంతాల్లో డ్రిజ్లింగ్ (చినుకులు) పడుతుండటంతో నిర్ణీత సమయానికి జరగాల్సిన టాస్ అధికారికంగా ఆలస్యం పడిపోయింది. ఆటకు వరుణుడు అంతరాయం కలిగిస్తుండటంతో క్రికెట్ అభిమానులు తీవ్ర ఉత్కంఠకు గురవుతున్నారు.
* టాస్ జాప్యం: భారీ వర్షం కారణంగా టాస్ వేయడాన్ని గ్రౌండ్ అంపైర్లు వాయిదా వేశారు.
కాసేపట్లో భారత్ vs వెస్టిండీస్ 5వ టీ20.. బెంగళూరులో వర్షం ఎఫెక్ట్.. ఇంతకీ మ్యాచ్ జరుగుతుందా?
Analysis pending
IND vs WI 5th T20I Weather: భారత్ వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ అత్యంత ఉత్కంఠభరితమైంది. ఇరు జట్లు చెరో రెండు మ్యాచుల్లో విజయం సాధించి 2-2తో సమంగా నిలిచిన నేపథ్యంలో, సిరీస్ విజేత ఎవరో తేల్చే ఐదో టీ20 మ్యాచ్ కాసేపట్లో (2026, అక్టోబర్ 17, శనివారం) బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనుంది. అయితే, గత కొన్ని రోజులుగా బెంగళూరులో కురుస్తున్న వర్షాలు, వాతావరణ శాఖ హెచ్చరికలు ఈ నిర్ణయాత్మక పోరుపై నీలి నీడలు కమ్ముకున్నాయి.
* ఉష్ణోగ్రత: 20°C నుండి 29°C మధ్య నమోదయ్యే అవకాశం ఉంది.
కలియుగ వైకుంఠం తిరుమలలో భారీ వర్షం కురిసింది. శుక్రవారం ( అక్టోబర్ 16 ) శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన గరుడసేవ సందర్భంగా తిరుమలకు భారీగా తరలి వచ్చారు భక్తులు. ఈ క్రమంలో భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా స్వామివారి దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు భక్తులు. ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నప్పటికీ భక్తుల గోవింద నామస్మరణతో తిరుమల కొండ మీద కోలాహలం నెలకొంది.
ఇవాళ రాత్రి గరుడ వాహనంపై శ్రీ మలయప్పస్వామివారు భక్తులకు దివ్యదర్శనం ఇవ్వనున్నారు. ఈ క్రమంలో భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో స్వామివారి కోసం నిరీక్షిస్తున్నారు. వర్షం కురుస్తున్నప్పటికీ భక్తులలో ఉత్సాహం ఏమాత్రం తగ్గడం లేదు. స్వామివారి గరుడసేవను కనులారా వీక్షించాలన్న భక్తుల సంకల్పం స్పష్టంగా కనిపిస్తోంది.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.