Namasthe Telangana ·
గోతులమయంగా బూర్గంపహాడ్- సారపాక, సారపాక- ఇరవెండి రహదారులు
– వాహనదారుల, ప్రజల అవస్థలు
బూర్గంపహాడ్, నవంబర్ 02 : ఈ దారిలో ప్రయాణం అంటే నరకయాతనే. దక్షిణ అయోధ్యగా పేరున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి పుణ్యక్షేత్రానికి వెళ్లాలంటే ఈ రహదారి గుండానే భక్తులు, పర్యాటకులు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ప్రత్యామ్నాయంగా మరో రహదారి ఉన్నప్పటికీ ఎక్కువగా బూర్గంపహాడ్ మండల కేంద్రం మీదుగా సారపాక నుండి భద్రాచలం వాహనాలు ప్రయాణించాల్సి ఉంటోంది. జాతీయ రహదారిగా ఉన్న బూర్గంపహాడ్-సారపాక రహదారి గోతులతో ప్రయాణీకులు, వాహనదారులకు యమపాశాలుగా మారింది. వేలాది వాహనాలు నిత్యం ఈ రహదారిపై ప్రయాణిస్తుంటాయి. బూర్గంపహాడ్ నుంచి సారపాకకు ఐదు కిలోమీటర్ల దూరం ఉండగా దారంతా ఎక్కడ పడితే పెద్ద పెద్ద గోతులు దర్శనమిస్తుండటంతో…