We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
Tech graduate named Krishna Koundinya died after collapsing in an unconscious state at a farmhouse in Aedulaabad, Ghatkesar, during a friend's birthday party. His father, retired SI C.
మేడ్చల్ జిల్లా: స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లిన రిటైర్డ్ ఎస్ఐ కుమారుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఏదులాబాద్ ఫామ్‌హౌస్‌లో చోటుచేసుకుంది. యువకుడి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ అతడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఉప్పల్ భగాయత్‌కు చెందిన రిటైర్డ్ ఎస్ఐ సి. ప్రవీణ్ కుమార్ కుమారుడు కృష్ణ కౌండిన్య (21) బీటెక్ పూర్తి చేశాడు. తన స్నేహితుడు ఘన్కోట్ రిషబ్‌తో కలిసి ఏదులాబాద్‌లోని లివిన్ ఫామ్‌హౌస్‌లో నిర్వహించిన పుట్టినరోజు వేడుకలకు వెళ్లాడు. అయితే, అక్కడ కృష్ణ కౌండిన్య అనుమానాస్పద పరిస్థితుల్లో అపస్మారక స్థితిలో పడిపోయాడు.
Students at Jamia Millia Islamia in New Delhi have been on a hunger strike for 14 days, demanding the conduct of student union elections and the removal of a senior university official.
ఇంటర్నెట్ డెస్క్: ఆన్లైన్ గేమింగ్ అప్పులు (Online Gaming Debt) తీర్చడానికి, గర్ల్‌ఫ్రెండ్‌తో విహారయాత్రలకు వెళ్లడానికి ఓ నీట్ విద్యార్థి కిడ్నాప్ డ్రామా ఆడాడు. తండ్రిని బెదిరించి డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నించాడు. పోలీసులు రంగంలోకి దిగడంతో అతడి ప్లాన్ బెడిసికొట్టింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దిల్లీకి చెందిన 17 ఏళ్ల యువకుడు లఖ్‌నవూలోని అలంబాగ్‌లో అద్దె ఇంట్లో ఉంటూ.. నీట్ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. కొన్నేళ్లుగా ఆన్లైన్ గేమింగ్‌కు బానిస అయ్యాడు. అందు కోసం రూ.50 వేలు అప్పు చేశాడు. అప్పులు తీర్చడానికి తండ్రి నుంచే డబ్బులు వసూలు చేయాలనుకుని.. కిడ్నాప్ డ్రామా (Faked Kidnapping)కు ప్లాన్ చేశాడు. అక్టోబర్ 20 నుంచి అతడి ఫోన్ కలవకపోవడం, ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం యువకుడిని కిడ్నాప్ చేశామని.. రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అతడి సోదరుడు, తల్లిదండ్రులు, మేనమామకు వాట్సప్ సందేశాలు రావడంతో వారు…
Jamia Millia Islamia : న్యూఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో విద్యార్థులు చేపట్టిన నిరాహార దీక్ష 14వ రోజుకు చేరింది. విద్యార్థులు మూడు ప్రధాన డిమాండ్లతో దీక్ష కొనసాగిస్తున్నారు. కొంతకాలంగా నిర్వహించకుండా ఉన్న విద్యార్థి సంఘం ఎన్నికలు నిర్వహించాలి అనేది మొదటి, ప్రధాన డిమాండ్. యూనివర్సిటీకి చెందిన ఒక ఉన్నతాధికారిని తొలగించాలనేది రెండో డిమాండ్ కాగా.. నిరసన చేపట్టిన విద్యార్థులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకూడదు అనేది మూడో డిమాండ్.
ఈ మూడు డిమాండ్ల సాధన కోసం జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్థులు కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. దీనిలో భాగంగా 14 రోజులుగా కొందరు విద్యార్థులు నిరాహార దీక్షకు దిగారు. వీరికి 100-150 మంది విద్యార్థులు సంఘీభావం తెలుపుతున్నారు. ఇదే సమయంలో యూనివర్సిటీకి చెందిన కొందరు ఉన్నతస్థాయి సిబ్బంది తమపై అనుచితంగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థి నేత ఫైజాన్ ఆరోపించారు. యూనివర్సిటీ సెక్యూరిటీ చీఫ్ విద్యార్థులపై అసభ్య పదజాలం ఉపయోగించారని ఫైజాన్ మండిపడ్డారు. దీంతో ఆయనను వెంటనే విధులనుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.