Eenadu ·
జిల్లా స్థాయి క్విజ్ పోటీల్లో పదోతరగతి విద్యార్థికి ప్రథమ బహుమతి
ఎల్లారెడ్డి: ఎలక్టోరల్ లిటరసీ క్లబ్ (ఈఎల్సీ) ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ స్థాయి వరకు జిల్లా స్థాయి క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో లింగంపేట మండలకేంద్రంలోని పీఎం శ్రీ జడ్పీహెచ్ఎస్ పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థి ఎన్. ప్రతీక్ గౌడ్ ప్రథమ బహుమతి సాధించాడు. ఈనెల 18న కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన పోటీల్లో ఇంటర్మీడియట్ విద్యార్థులతో పోటీపడి పదో తరగతి స్థాయిలోనే విజేతగా నిలవడం విశేషం. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ చేతులమీదుగా ప్రతీక్ గౌడ్ ప్రథమ బహుమతిని అందుకున్నాడు. విద్యార్థిని ఎంఈఓ అంజల్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సిద్ధికి, ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.