We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల హాస్టల్లో థర్డ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థిని గురువారం సాయంత్రం మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. బాధితురాలు మాట్లాడుతూ తోటి విద్యార్థులు, అధ్యాపకుల వేధింపులే తన ఆత్మహత్యాయత్నానికి కారణమని ఆరోపించింది.
Ragging | జగిత్యాల కలెక్టరేట్ : జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల హాస్టల్లో థర్డ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థిని గురువారం సాయంత్రం మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన తోటి విద్యార్థినులు ఆమెను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా ఆమెకు ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై బాధితురాలు మాట్లాడుతూ తోటి విద్యార్థులు, అధ్యాపకుల వేధింపులే తన ఆత్మహత్యాయత్నానికి కారణమని ఆరోపించింది. తోటి విద్యార్థులు ర్యాగింగ్ తరహాలో వేధిస్తున్నారంటూ ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, ఫిర్యాదు తర్వాత…
హైదరాబాద్ యూనివర్సిటీలో అభినవ్ లక్రా అనే పీజీ విద్యార్థి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యాయత్నం చేశాడు. గచ్చిబౌలి పోలీసులు స్పందించి అతడిని హాస్టల్ మూడో అంతస్తు బాల్కనీలో రక్షించారు. అనంతరం విద్యార్థిని యూనివర్సిటీ సేఫ్ టీంకు అప్పగించి కౌన్సెలింగ్ ఇచ్చారు.
హైదరాబాద్ యూనివర్సిటీలో ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. హాస్టల్ బిల్డింగ్ పైనుంచి దూకి చనిపోయేందుకు యత్నించాడు పీజీ సోషియాలజీ చదువుతున్న స్టూడెంట్. హాస్టల్ బిల్డింగ్ మూడో అంతస్తు ఎక్కి బాల్కనీలో ఉండడం, దూకేందుకు యత్నించడంతో యూనివర్సిటీ విద్యార్థులు, ప్రొఫెసర్లు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు రాకపోతే యూనివర్సిటీలో పరిస్థితి మరోలా ఉండేది తోటి విద్యార్థులు, ప్రొఫెసర్లు చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే..
శుక్రవారం(నవంబర్ 27, 2026) హైదరాబాద్ యూనివర్సిటీ హాస్టల్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. అభినవ్ లక్రా అనే పీజీ విద్యార్థి సూసైడ్ నోట్ రాసి కనిపించకుండాపోయాడు. దీంతో తోటి విద్యార్తులు డయల్ 100కు సమాచారం అందించారు. స్పందించిన గచ్చిబౌలి పోలీసులు వెంటనే హైదరాబాద్ యూనివర్సిటీలోని ఎల్ మెన్స్ హాస్టల్‌కు చేరుకున్నారు. విద్యార్థికోసం హాస్టల్ అంతా వెదికారు. చివరికీ హాస్టల్ లని మూడో అంతస్తు బాల్కనీలో విద్యార్థి ఉన్నట్లు గుర్తించారు. అతడు బిల్డింగ్ పైనుంచి దూకేందుకు యత్నించగా పోలీసులు చాకచక్యంగా కాపాడారు. అనంతరం విద్యార్థిని యూనివర్సిటీ సేఫ్ టీంకు అప్పగించి కౌన్సెలింగ్ ఇచ్చారు.
అమరావతి : ఏపీలోని అనకాపల్లి ( Anakapally ) జిల్లా కేంద్రంలో ఘోరం జరిగింది. తండ్రి తో కళాశాలకు బయలు దేరిన డిగ్రీ విద్యార్థిని ( Degree Student ) పై ఇనుపకడ్డీలు ( Iron rods ) మీదపడి మృతి చెందింది.
విశాఖ నుంచి విజయవాడ వైపు ఇనుప కడ్డీలతో వెళ్తున్న లారీ రేగుపల్లి వద్ద బోల్తా పడింది. అదే సమయంలో ద్విచక్రవాహనంపై తండ్రితో కలసి వెళ్తున్న మన్యంపాలెం నాగసాయి లక్ష్మి అనే విద్యార్థిపై పడింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమద్యలో మృతి చెందింది. తండ్రికి స్వల్పగాయాలయ్యాయి.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.