We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
తమిళనాడులో పెట్టుబడులకు సంబంధించిన రహస్య సమాచారం ఆంధ్రప్రదేశ్‌కు లీకైనట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి, పలు ప్రాజెక్టులు ఆంధ్రాకు తరలిపోవడంతో ఈ అనుమానాలు బలపడ్డాయి. దర్యాప్తు చేసిన తమిళనాడు ప్రభుత్వం 15 మంది సీనియర్ అధికారులను తొలగించింది.
చెన్నై: తమిళనాడులో పలు కంపెనీల పెట్టుబడులకు సంబంధించిన రహస్య సమాచారం ఆంధ్రప్రదేశ్‌కు లీకైనట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. పలు ప్రాజెక్టులు ఆంధ్రాకు తరలిపోవడంతో ఇది మరింత బలపడింది. దీనిపై దర్యాప్తు చేసిన తమిళనాడు ప్రభుత్వం 15 మంది సీనియర్ అధికారులను తొలగించింది. దీంతో ఇరు రాష్ట్రాల్లో రాజకీయ వివాదానికి ఇది దారి తీసింది. (Tamil Nadu investments leaked to Andhra) తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం అనుసరిస్తున్న ఇన్వెస్ట్మెంట్ విధానానికి సంబంధించిన కీలక సమాచారం ఆంధ్రప్రదేశ్‌కు లీకైనట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. మొదట తమిళనాడులో పెట్టుబడులకు ముందుకు వచ్చిన కొన్ని…
కాగా, తమిళనాడు పెట్టుబడి ప్రోత్సాహక సంస్థ అయిన ‘గైడెన్స్ తమిళనాడు’ ఆ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఈ ప్రభుత్వ విభాగంలో చాలా కాలంగా పని చేస్తున్న సీనియర్ అధికారులు కీలకమైన పెట్టుబడుల రహస్య సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్‌కు చేరవేసినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. తమిళనాడులో ఇన్వెస్ట్మెంట్ కోసం ముందుకు వచ్చిన కంపెనీల వివరాలను ఆంధ్రా ప్రభుత్వానికి వారు అందజేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో దర్యాప్తు తర్వాత 15 మంది సీనియర్ అధికారులను తమిళనాడు ప్రభుత్వం తొలగించింది. తొలగించిన సీనియర్ అధికారుల్లో చాలా మంది 2016 నుంచి 2021 వరకు అధికారంలో ఉన్న అన్నాడీఎంకే ప్రభుత్వ…
విజయ్ ఆంటోని నటించిన 'అప్పా కుట్టి' చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ఆయన భార్య ఫాతిమా ఆంటోని హాజరయ్యారు మరియు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మీరా మరణం తర్వాత తాను సినిమా కార్యక్రమాలకు హాజరుకావడం లేదని ఫాతిమా వెల్లడించారు.
భాజపా సీనియర్ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ లేకుంటే విజయ్ సీఎం అయ్యేవారుకాదని పేర్కొన్నారు. డీఎంకే ప్రభుత్వం కార్తిక దీపం వెలిగించకుండా అడ్డుకుందని, మంత్రి నిర్మల్‌కుమార్ ఇందుకు వ్యతిరేకంగా మాట్లాడడాన్ని ఖండించామని ఆమె తెలిపారు.
దక్షిణాది సినీ ఇండస్ట్రీలో నటుడిగా, సంగీత దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న కోలీవుడ్ స్టార్ విజయ్ అంటోని. ము మారన్ దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం 'అప్పా కుట్టి'. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న భార్య పాతిమా ఆంటోని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన పెద్దకుమార్తె మీరాను గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. అంతే కాదు విజయ్ ఆంటోని వ్యక్తిత్వం, కుటుంబంపై ఆయనకున్న ప్రేమ గురించి ఫాతిమా చెప్పిన విషయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
మీరా మరణం తర్వాత తాను ఎలాంటి సినిమా కార్యక్రమాలకు హాజరుకావడం లేదని ఫాతిమా వెల్లడించారు. దాదాపు పదేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ ఓ సినిమా వేడుకకు వచ్చానని తెలిపారు. గత కొన్నేళ్లుగా విజయ్ ఆంటోని చెప్పులు, షూస్ ధరించకపోవడం వెనుక ఉన్న కారణాన్ని కూడా ఆమె బయటపెట్టారు. మీరా కోసం గతంలో ఎన్నో చెప్పులు, షూస్ కొనుగోలు చేశామని .. అవన్నీ ఒక గదిలో నిండిపోయి ఉన్నాయని చెప్పారు. వాటిని చూసినప్పటి నుంచి విజయ్ ఆంటోని పాదరక్షలు ధరించడం మానేశారని భావోద్వేగంతో చెప్పారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే షూస్ వేసుకుంటారని తెలిపారు.
ఆర్కేనగర్, న్యూస్‌టుడే: ఎస్ఐఆర్ లేకుంటే కచ్చితంగా విజయ్ సీఎం అయ్యేవారుకాదని భాజపా సీనియర్ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ అన్నారు. తిరుచ్చి విమానాశ్రయంలో ఆమె మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ... తిరుప్పరంకుండ్రం కొండపై కార్తిక దీపం వెలిగించాలని తాము ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. దీపం వెలిగించకుండా అడ్డుకున్న డీఎంకే ప్రభుత్వం ఇప్పుడు లేదన్నారు. ప్రస్తుతం మంత్రి నిర్మల్‌కుమార్ ఇందుకు వ్యతిరేకంగా మాట్లాడడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. ఈ వ్యవహారంలో కోర్టుని ఆశ్రయించడం సరికాదన్నారు. అయినా ఈ విషయంలో మంచి తీర్పు వస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు. మహిళా కలెక్టర్‌కు అసభ్యకర సందేశాలు పంపిన ఎమ్మెల్యేని…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
అందుకే విజయ్ ఆంటోని చెప్పులు ధరించడం లేదు: ఫాతిమా
Analysis pending
వేదికపై ప్రీతి అస్రాని, విజయ్ ఆంటోని
చెన్నై, న్యూస్‌టుడే: నటుడు విజయ్ ఆంటోని చెప్పులు ధరించకపోవడానికి కారణాన్ని ఆయన సతీమణి, నిర్మాత ఫాతిమా విజయ్ ఆంటోని వెల్లడించారు. ము.మారన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోని, ప్రీతి అస్రాని, బేబీ లితన్యా ప్రధానపాత్రల్లో నటించిన ‘అప్పా కుట్టి’ ఈ నెల 20వ తేదీ థియేటర్లలోకి రానున్న సందర్భంగా చెన్నైలో ముందస్తు విడుదల, ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఫాతిమా విజయ్ ఆంటోని మాట్లాడుతూ... తమ కుమార్తె మీరా ఉపయోగించిన వస్తువులు ఆమె గదిలో నేటికీ జ్ఞాపకాలుగా కాపాడుకుంటున్నామని తెలిపారు. మీరా కోసం కొనుగోలు చేసిన చెప్పులను చూసి ఇకపై జీవితంలో చెప్పులు ధరించకూడదని విజయ్ ఆంటోని నిర్ణయించారని…
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.