V6 Velugu ·
అనిరుధ్– కావ్య మారన్ రిసెప్షన్.. ధోనీతో పాటు అజిత్, రజనీ, నయనతార, విజయ్, రష్మిక సందడి
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander), సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్ (Kavya Maran) ల రిసెప్షన్ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. నవంబర్ 21న మొదలైన ఈ గ్రాండ్ ఈవెంట్, నవంబర్ 22న కూడా అత్యంత కోలాహలంగా కొనసాగింది. సినిమా, క్రీడలు, రాజకీయ రంగాలకు చెందిన పలువురు దిగ్గజాలు హాజరై నూతన జంటకు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా మహేంద్ర సింగ్ ధోని, అజిత్ కుమార్, రజనీకాంత్, విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా, నయనతార హాజరు కావడం ఈ వేడుకకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
* రిసెప్షన్ రెండో రోజు జరిగిన ఈ వేడుకలో క్రికెట్, సినిమా దిగ్గజాల కలయిక సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది.