Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
1,000 టీఎంసీల నీళ్లను వృథాగా దిగువకు వదిలారు: కేటీఆర్ - Visalaandhra
By Shanthi||2 min read at Visalaandhra
In brief
Written by a model, not by Visalaandhra · not verifiedAI summary· Generated October 20, 2026
- KTR, the Working President of BRS, alleged that the Congress government in Telangana is responsible for the current water crisis, claiming 1,000 TMC of water was wasted by not operating pumps and filling reservoirs. He also criticized the state government for lacking pre-emptive plans for El Niño and failing to protect Telangana's rightful water share against Andhra Pradesh.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
తెలంగాణలో నీటి ఎద్దడికి కాంగ్రెస్ కారణమని కేటీఆర్ ఆరోపణతెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న నీటి ఎద్దడికి ప్రకృతి కారణం కాదని, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో కనిపిస్తున్నది కాలం తెచ్చిన కరవు కాదని, కాంగ్రెస్ సర్కారు తెచ్చిన ‘చేతకాని కరవు్ణ అని విమర్శించారు. పంపులు ఆన్ చేయకుండా, రిజర్వాయర్లను నింపకుండా నీటిని వృథాగా దిగువకు వదిలేశారని మండిపడ్డారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
1,000 టీఎంసీల నీరు వృథా చేశారంటూ..ఈ ఏడాది జూన్ 1 నుంచి ఇప్పటివరకు 750 టీఎంసీలకు పైగా గోదావరి నీటిని, 250 టీఎంసీల కృష్ణా జలాలను సముద్రంలోకి, దిగువ ప్రాంతాలకు వదిలేశారని కేటీఆర్ పేర్కొన్నారు. కన్నెపల్లి, దేవాదుల పంపులను సక్రమంగా నిర్వహించి వినియోగించుకుని ఉంటే గోదావరి పరివాహక ప్రాంతంలోని రిజర్వాయర్లు, చెరువులు నిండేవని అన్నారు. కానీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. కృష్ణా జలాలను వినియోగించుకునేందుకు వీలున్న పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల పంపులను ఆన్ చేయకుండా నిర్లక్ష్యం వహించారని విమర్శించారు. ప్రాజెక్టుల ద్వారా నీటిని ఎత్తిపోసి నిల్వ చేసుకునే అవకాశం…