Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
‘108’లో కంటి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్... దేశంలోనే తొలిసారి హైదరాబాద్‌లో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం
By V6 Velugu||1 min read at V6 Velugu
In brief
A pilot project was launched in Hyderabad to provide emergency eye treatment in 108 ambulances.
The initiative was jointly started by LV Prasad Eye Institute (LVPEI), EMRI Green Health Services (108), and Sarojini Devi Eye Hospital to prevent permanent blindness from eye injuries.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, వెలుగు: కంటి గాయాలతో బారిన పడకుండా బాధితులకు సకాలంలో ప్రాథమిక చికిత్స అందించేందుకు 108 అంబులెన్స్‌ల్లో ప్రత్యేక సేవలు ప్రారంభించారు. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో చేపట్టిన ఈ పైలట్ ప్రాజెక్టును గురువారం ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ (ఎల్వీపీఈఐ), ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ (108), సరోజినీ దేవి కంటి ఆస్పత్రి సంయుక్తంగా ప్రారంభించాయి. దీపావళి వేళ పటాకుల ప్రమాదాల ముప్పును దృష్టిలో పెట్టుకుని ఈఎంఆర్ఐ డైరెక్టర్ కే కృష్ణంరాజు, ఎల్వీపీఈఐ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ గుళ్లపల్లి ఎన్. రావు సేవలను ప్రారంభించారు.
కంటి గాయాల బాధితులు స్పెషలిస్ట్ ఆస్పత్రులకు చేరడంలో ఆలస్యం వల్ల చూపు కోల్పోయే ప్రమాదం పెరుగుతోందని వైద్యులు తెలిపారు. యువత, పని చేసే వయసులో ఉన్నవారిలో కంటి గాయాలు దృష్టి లోపానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా మారుతున్న నేపథ్యంలో ఈ సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఇందులో భాగంగా 108 ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లు (ఈఎంటీలు), ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఆఫీసర్లు, ఈఎంఎస్ ట్రైనర్లకు గాయాలను గుర్తించడం, తీవ్రతను అంచనా వేయడం, అత్యవసర కాల్స్‌ను నిర్వహించడంపై శిక్షణ ఇచ్చారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)