Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
12.29 శాతానికి టోకు ద్రవ్యోల్బణం
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకారం అక్టోబర్‌లో టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 12.29 శాతంగా నమోదైంది.
ఇంధనం, విద్యుత్తు, ఆహారేతర వస్తువుల ధరల పెరుగుదల ఇందుకు ప్రధాన కారణమని అధికారిక గణాంకాలు తెలిపాయి.
పలువురు ఆర్థికవేత్తలు, బార్క్లేస్, బ్రిక్‌వర్క్ సంస్థలు భవిష్యత్తులో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టవచ్చని అంచనా వేశాయి.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage → · Followed over 12 days across 2 events →
న్యూఢిల్లీ, నవంబర్ 16 : గత నెల అక్టోబర్‌లో టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 12.29 శాతంగా నమోదైందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. 2022-23ను ప్రాతిపదికగా తీసుకున్న కొత్త డబ్ల్యూపీఐ సిరీస్‌లో ఇదే అత్యధికం కావడం గమనార్హం. ఇంధనం, విద్యుత్తు, ఆహారేతర వస్తువుల ధరలు పెరుగడం ఇందుకు ప్రధాన కారణమని అధికారిక గణాంకాల్లో తేలింది. కాగా, అంతకుముందు నెల సెప్టెంబర్‌లో ఇది 11.39 శాతంగా ఉన్నది. ఇక ఆహారోత్పత్తుల ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 8.14 శాతం ఉంటే, అక్టోబర్‌లో 8.26 శాతానికి చేరింది. ఆహారేతర వస్తువుల్లో ఇది 10.28 శాతం నుంచి 11.69 శాతానికి పెరిగింది. అలాగే ఖనిజాల…
ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు తగ్గుముఖం పట్టడం వల్ల నవంబర్‌లో టోకు ద్రవ్యోల్బణం తగ్గే అవకాశం ఉన్నదని పలువురు ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ నెలాఖరుదాకా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పెరుగుతూపోతే, ముడి చమురు ధరలు బలహీనపడితే టోకు ద్రవ్యోల్బణం సుమారు 11.5 శాతానికి తగ్గవచ్చని అంటున్నారు. ‘అక్టోబర్ గరిష్ఠ స్థాయితో పోలిస్తే నవంబర్‌లో ఇప్పటివరకు ప్రపంచ ఇంధన ధరలు తగ్గాయి. దీంతో రానున్న నెలల్లో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణ వేగం తగ్గవచ్చు’ అని బార్క్లేస్ అన్నది. కాగా, ఈ ఆర్థిక సంవత్సరం (2026-27) మూడో త్రైమాసికంలో సీపీఐ ద్రవ్యోల్బణం సుమారు 6 శాతం వద్ద గరిష్ఠానికి చేరి ఆ తర్వాత తగ్గుతుందని…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)