Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
125 మెడికల్ షాపులకు షోకాజ్ నోటీసులు..
By V6 Velugu||1 min read at V6 Velugu
In brief
TG Safe Drugs officials conducted raids on 125 medical shops in and around Hyderabad for illegally selling habit-forming drugs without prescriptions.
Officials issued show-cause notices and initiated departmental action to suspend or cancel the licenses of the offending shops.
The raids uncovered the sale of Schedule H1 and Schedule X drugs, including tramadol and alprazolam, without proper records or a pharmacist present.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, వెలుగు: డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు, అలవాటుగా మారే మందులను అక్రమంగా విక్రయిస్తున్న మెడికల్ షాపులపై టీజీ సేఫ్ -డ్రగ్స్ విభాగం అధికారులు దాడులు చేశారు. క్యూర్ ప్రాంత పరిధిలోని గాజులరామారం, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, కాప్రా, హబ్సిగూడ, ఉప్పల్, జీడిమెట్ల, బాలానగర్, మేడిపల్లి, శామీర్పేట జోన్లతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో డెకాయ్ ఆపరేషన్లు, టెస్ట్ కొనుగోళ్ల ద్వారా తనిఖీలు చేపట్టారు. రూల్స్ బ్రేక్ చేసిన 125 మెడికల్ షాపుల్లో అవకతవకలను గుర్తించి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ప్రకారం లైసెన్సులను సస్పెండ్ చేయడంతో పాటు రద్దు చేయడానికి…
ఈ తనిఖీల్లో రూల్స్ కు విరుద్ధంగా ట్రామడాల్, ఆల్ప్రాజోలమ్, నైట్రాజెపమ్, కొడీన్ దగ్గు సిరప్లు, టపెంటడాల్, ప్రీగాబాలిన్, జోల్పిడెమ్ వంటి షెడ్యూల్ హెచ్1, షెడ్యూల్ ఎక్స్ కేటగిరీ మందులు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మడం, ప్రిస్క్రిప్షన్ రికార్డులు, షెడ్యూల్ హెచ్1 రిజిస్టర్లు నిర్వహించకపోవడం, ఫార్మసిస్ట్ లేకుండానే మందులు ఇవ్వడం, బిల్లులు జారీ చేయకపోవడం, రికార్డులు చూపించకపోవడం వంటివి గుర్తించారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)