Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
1991లాగే 2026
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Chief Economic Advisor V.
Anantha Nageswaran commented at a national conference that 2026 might resemble 1991, but clarified that he was not predicting an economic crisis like the one India faced that year.
He highlighted structural challenges in manufacturing, energy, agriculture, and technology, and urged governments and industries to strengthen domestic capacity.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
న్యూఢిల్లీ, అక్టోబర్ 29: ప్రస్తుత ఏడాది 2026.. 1991లాగే ఉంటుందని ముఖ్య ఆర్థిక సలహాదారు వీ అనంత నాగేశ్వరన్ ఒక్కసారిగా బాంబు పేల్చారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఈ సంవత్సరాన్ని కీలక మలుపుగానే పరిగణించవచ్చని వ్యాఖ్యానించారు. అయితే ఆ వెంటనే 1991 అంటే.. ఆర్థిక సంక్షోభం కాదని అనడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. గురువారం ఐఎస్ఐడీ-ఐడీఆర్‌ఏ జాతీయ సదస్సునుద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా అంతర్జాతీయంగా సవాళ్లేగాక.. తయారీ, ఎనర్జీ, వ్యవసాయ, టెక్నాలజీ రంగాల్లో భారత్‌కు నిర్మాణాత్మక అడ్డంకులు ఎదురవుతున్నాయని చెప్పారు. ఈ క్రమంలోనే ‘2026.. 1991ని పోలి ఉంటుంది.
మీరంతా వెంటనే అప్పటి ఆర్థిక సంక్షోభం మళ్లీ సంభవిస్తుందా? అనుకోకండి’ అన్నారు. 1991లో దేశంలో విదేశీ మారకపు నిల్వలు అడుగంటిపోయి కనీస చెల్లింపులు కూడా చేయలేని దుస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. దీంతో అనేక సాహసోపేత సంస్కరణలు చేపట్టారు. ఇవి ఆ తర్వాత కాలంలో భారత ఆర్థిక ముఖచిత్రాన్నే మార్చేశాయి. అలాగే ఈ ఏడాదీ జరుగవచ్చన్న అభిప్రాయాన్ని నాగేశ్వరన్ వెలిబుచ్చారు. నిజానికి స్థూల ఆర్థిక స్థిరత్వం, స్థితిస్థాపకతల్లో భారత్‌ను ఓ ఆశాకిరణంగా అంతర్జాతీయ సమాజం అభివర్ణిస్తున్నదని ఆయన గుర్తుచేశారు. అయినప్పటికీ కొన్నిసార్లు దీన్ని మరచి సోషల్ మీడియాలో అనవసరపు కథనాలను…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)