Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
26న కృష్ణా బోర్డు మీటింగ్.. ఇరు రాష్ర్టాలకు కేఆర్ఎంబీ లేఖ
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 19, 2026
- The Krishna River Management Board (KRMB) has scheduled its 21st meeting for October 26 to discuss water sharing agreements between Andhra Pradesh and Telangana. The meeting was called after previous trilateral committee meetings failed to resolve differences between the two states over water utilization. The board previously decided to hold a full meeting instead of a smaller committee session due to a lack of consensus.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ) : కృష్ణా నదీ యాజమాన్య బోర్డు 21వ బోర్డు సమావేశాన్ని ఈ నెల 26వ తేదీన నిర్వహిస్తారు. ఈ మేరకు ఇరు రాష్ర్టాలకు కేఆర్ఎంబీ చైర్మన్ గురువారం సమాచారం అందించారు. సమావేశంలో నీటి వాటాలపై ప్రధానంగా చర్చిస్తారు. ప్రతి నీటి సంవత్సరం అంటే జూన్ 1 నుంచి మే 31వ తేదీ వరకు ఉమ్మడి రిజర్వాయర్ల నుంచి నీటి వినియోగాలకు ఇరు రాష్ర్టాలు ఒప్పందాలు చేసుకోవాలి. అందుకు పూర్తిస్థాయి బోర్డు సమావేశం నిర్వహించాలి. కానీ, ఎల్ నినో పరిస్థితులు నెలకొన్న తరుణంలోనూ ఈ సీజన్లో అందుకు భిన్నంగా బోర్డు వ్యవహరించింది.
పూర్తిస్థాయి బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేయకుండా, కేవలం నీటి వినియోగాలకు సంబంధించిన త్రిసభ్య కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తొలుత ఆగస్టు 24వ తేదీన, తదుపరి ఈ నెల 4వ తేదీన రెండు దఫాలుగా త్రిసభ కమిటీ సమావేశం జరిగింది. నీటి వినియోగాలపై ఇరురాష్ర్టాల మధ్య సయోధ్య కుదరకపోవడంతో పూర్తిస్థాయి బోర్డు సమావేశాన్ని నిర్వహించాలని కేఆర్ఎంబీ నిర్ణయించింది. తొలుత అక్టోబర్ 1న సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. అది వాయిదా పడింది. ఈ నేపథ్యంలో తాజాగా 26వ తేదీన నిర్వహించాలని నిర్ణయించింది. జలసౌధలో ఉదయం 11 గంటలకు చైర్మన్ నేతృత్వంలో జరిగే సమావేశానికి బోర్డు సభ్యులు, ఇరు రాష్ర్టాల…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)