Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
35 మంది జేఎల్స్ను విధుల్లోకి తీసుకోవాలి..ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఆదేశాలు
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
The High Court issued interim orders halting the dismissal of 35 Junior Lecturers by the Intermediate Education Department, stating the dismissals were invalid as the employees were not given a chance to be heard.
The court directed authorities to reinstate the dismissed employees immediately but clarified that the order does not prevent the department from conducting a departmental inquiry.
The lecturers had challenged their dismissal, which was based on allegations of submitting fake certificates during a larger regularization process of over 3,000 contract lecturers.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, వెలుగు: నకిలీ ధ్రువీకరణ పత్రాలు సమర్పించారన్న ఆరోపణలతో విచారణ జరపకుండా 35 మంది జూనియర్ లెక్చరర్లను ఉద్యోగాల నుంచి తొలగించడం చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నెల 1న వారిని తొలగిస్తూ ఇంటర్విద్యాశాఖ డైరెక్టర్ జారీ చేసిన ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ బుధవారం మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. తొలగించిన వారందరినీ వెంటనే విధుల్లోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.
కానీ చట్టప్రకారం శాఖాపరమైన విచారణ చేపట్టేందుకు ఈ ఉత్తర్వులు అడ్డంకి కావని పేర్కొంది. ఈ పిటిషన్లపై జస్టిస్ కె.శరత్ విచారణ చేపట్టారు. 2023 మే 3న 3 వేల మందికిపైగా కాంట్రాక్టు లెక్చరర్లను ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. ఈ ప్రక్రియలో నకిలీ ధ్రువీకరణ పత్రాలు సమర్పించారన్న ఆరోపణలతో 35 మందిని తొలగించడాన్ని సవాలు చేస్తూ బాధితులు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)