Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
4 వారాల్లో కోర్టు ఉత్తర్వులు అమలు చేయాల్సిందే : హైకోర్టు
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
The High Court granted a final 4-week deadline for the government to implement its 2019 orders regarding the regularization of employees in the Tribal Welfare Department.
Officials from the Economic Affairs and Tribal Welfare Departments requested this extension during the hearing, but the court warned that the Economic Affairs Special Secretary and the Tribal Welfare Commissioner would be summoned personally if they fail to file a compliance report by November 23.
This order follows a contempt petition filed by a group of 12 employees from the Warangal Tribal Welfare office after the initial 2019 directive was not executed.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, వెలుగు: గిరిజన సంక్షేమ కార్యాలయంలో ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించి 2019లో ఇచ్చిన ఉత్తర్వులను 4 వారాల్లో అమలు చేయాలని హైకోర్టు చివరగా అధికారులకు ఓ అవకాశం ఇచ్చింది. నవంబరు 23లోగా అమలు నివేదికను దాఖలు చేయకపోతే ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి సిక్తా పట్నాయక్, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ సంతోష్‌లు తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. గిరిజన సంక్షేమ శాఖలో 5 ఏండ్ల సర్వీసు పూర్తయినప్పటి నుంచి క్రమబద్ధీకరణ అమలు చేసేలా ఆదేశాలివ్వాలంటూ వరంగల్ గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న యాకూబ్ సహా మరో 11 మంది హైకోర్టులో పిటిషన్ వేశారు.
దీనిని విచారించిన హైకోర్టు 8 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని 2019లో ఆదేశాలిచ్చినా అమలు చేయకపోవడంతో 2021లో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ టి. మాధవీదేవి సోమవారం మరోసారి విచారణ చేపట్టారు. గిరిజన సంక్షేమ శాఖ తరఫు ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. దీనికి సంబంధించిన ఫైలును ఆర్థిక శాఖకు పంపామని తెలిపారు. అయితే, ఆర్థిక శాఖ తరఫు ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఈఫైలు ఇంకా అందలేదని చెప్పారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)