Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
50 కోట్ల మంది గేమర్లతో 2వ స్థానంలో భారత్.. దూసుకుపోతున్న రాబ్లాక్స్!
By V6 Velugu||1 min read at V6 Velugu
In brief
Written by a model, not by V6 Velugu · not verifiedAI summary· Generated October 19, 2026
- The Indian gaming sector has grown to become the world's second-largest market with over 500 million users. Roblox is rapidly expanding in India, providing income and employment opportunities for local creators through user-generated content. The platform's growth is projected to significantly boost the Indian economy and create hundreds of jobs.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
భారతీయ గేమింగ్ రంగం 50 కోట్ల మందికి పైగా యూజర్లతో ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మార్కెట్‌గా అవతరించింది. 2025లో రూ. 6వేల 300 కోట్లుగా ఉన్న భారతీయ గేమింగ్ పరిశ్రమ ఆదాయం, ఏటా 13 శాతం వృద్ధితో 2028 నాటికి రూ. 9వేల 200 కోట్లకు చేరుతుందని యాక్సెస్ పార్ట్నర్షిప్ రిపోర్ట్ అంచనా. ఈ నేపథ్యంలో ప్రముఖ గేమింగ్ ప్లాట్‌ఫారమ్ 'రాబ్లాక్స్' భారతదేశంలో వేగంగా విస్తరిస్తోంది. 2020 నుంచి 2025 మధ్య దేశంలో రోబ్లాక్స్ రోజువారీ యాక్టివ్ యూజర్ల సంఖ్య భారీగా పెరిగింది.
ఈ వేదిక కేవలం వినోదం మాత్రమే కాకుండా.. భారతీయ క్రియేటర్లకు ఉపాధి, ఆదాయ వనరుగా మారుతోంది. గత ఐదేళ్లలో రాబ్లాక్స్ ద్వారా ఆదాయం పొందే ఇండియన్ క్రియేటర్ల సంఖ్య ఏటా 96 శాతం పెరిగింది. సంప్రదాయ కోడింగ్ అనుభవం లేకున్నా.. సులభమైన టూల్స్ సహాయంతో ఎంతో మంది చిన్న స్టూడియోలు, యువ క్రియేటర్లు . బెంగళూరుకు చెందిన 'స్మాల్ వరల్డ్ గేమ్స్', న్యూఢిల్లీకి చెందిన 'మెటా ఫ్యాషన్' వంటివి భారత్‌లో పుట్టి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి.