Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
90స్ కిడ్స్ ఫేవరెట్ డ్రింక్ ఈజ్ బ్యాక్.. 26 ఏళ్ల తర్వాత మళ్లీ మార్కెట్లోకి గోల్డ్ స్పాట్ వచ్చేస్తోంది!
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
90వ దశకంలో భారతీయ మార్కెట్లో ప్రాచుర్యం పొందిన 'గోల్డ్ స్పాట్' కూల్ డ్రింక్ సుమారు 26 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ మార్కెట్లోకి రాబోతోందని సమాచారం.
కోకాకోలా ఈ డ్రింక్‌ను 'లో-షుగర్', 'నో-షుగర్' వేరియంట్లలో తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని, ఆయన భార్య సాక్షి సోషల్ మీడియాలో గోల్డ్ స్పాట్ క్యాన్లతో కనిపించడం ఈ రీ-లాంచ్ వార్తలకు మరింత బలాన్నిచ్చింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
90వ దశకంలో భారతీయ మార్కెట్‌ను ఒక ఊపు ఊపిన 'గోల్డ్ స్పాట్' కూల్ డ్రింక్ సుమారు 26 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ మార్కెట్లోకి అడుగుపెట్టబోతోంది. 'ది జింగ్ థింగ్' అనే ట్యాగ్‌లైన్‌తో ఒకప్పుడు పిల్లలు, యువతకు ఎంతో ఇష్టమైన ఈ ఆరెంజ్ ఫిజీ డ్రింక్ వచ్చే వారమే దుకాణాల్లో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.
అయితే ఈసారి గోల్డ్ స్పాట్ సరికొత్త అవతారంలో రాబోతోంది. ప్రస్తుతం వినియోగదారులలో ఆరోగ్య స్పృహ పెరగడం, చక్కెర తక్కువగా ఉన్న డ్రింక్స్ కి డిమాండ్ ఉండటంతో.. ఈ డ్రింక్‌ను 'లో-షుగర్', 'నో-షుగర్' వేరియంట్లలో తీసుకువస్తోంది కోకాకోలా. తద్వారా కోకాకోలాకు చెందిన మరో ఆరెంజ్ డ్రింక్ 'ఫాంటా' అమ్మకాలపై ఎలాంటి ప్రభావం పడకుండా జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. ఇటీవల టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని, ఆయన భార్య సాక్షి సోషల్ మీడియాలో గోల్డ్ స్పాట్ క్యాన్లతో కనిపించడం ఈ రీ-లాంచ్ వార్తలకు మరింత బలాన్నిచ్చింది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)