Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఆ ఉత్తర్వుల అమలుకు 4 వారాల గడువు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
The High Court has given the state government an additional 4-week deadline to implement its 2019 orders regarding the regularization of Tribal Welfare Department employees.
The court ordered the government to submit a related report within this period, failing which the financial department's special secretary and the Tribal Welfare Commissioner will have to appear in person to explain.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ) : గిరిజన సంక్షేమశాఖ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించి 2019లో తాము జారీచేసిన ఉత్తర్వుల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వానికి మరో 4 వారాల గడువు ఇస్తున్నట్టు హైకోర్టు స్పష్టం చేసింది. ఈ గడువులోగా ఆ ఉత్తర్వులను అమలు చేయడంతోపాటు సంబంధిత నివేదికను సమర్పించాలని ఆదేశించింది. లేనిపక్షంలో ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి సిక్తా పట్నాయక్ , గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ సంతోష్ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది.
గిరిజన సంక్షేమశాఖలో ఐదేండ్ల సర్వీసు పూర్తయినప్పటి నుంచి వర్తించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ వరంగల్ గిరిజన సంక్షేమశాఖ కార్యాలయ ఉద్యోగి యాకూబ్, మరో 11 మంది హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ అంశంపై 8 వారాల్లోగా నిర్ణ యం తీసుకోవాలని 2019లో హైకోర్టు ఆదేశించింది. ఆ ఉత్తర్వులు అమలు కాకపోవడంతో పిటిషనర్లు కోర్టుధికరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ మాధవీదేవి మరోసారి విచారణ చేపట్టడంతో.. హైకోర్టు ఉత్తర్వుల అమలుకు మరో 4వారాల గడువు కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)