Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ఆర్జీలను వేగంగా పరిష్కరించాలి: కలెక్టర్
By Eenadu1 min read at Eenadu
In brief
Collector S.
Ramasundar Reddy instructed officials to fully utilize the new PGRS system to resolve public grievances quickly and transparently.
He directed various department heads to coordinate and use technology to automatically identify and resolve recurring complaints.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
విజయనగరం రూరల్: పీజీఆర్ఎస్లో ప్రజల నుంచి అందే ఫిర్యాదులు, ఆర్జీలను వేగంగా, పారదర్శకంగా పరిష్కరించేందుకు నూతన ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తన కార్యాలయంలో మంగళవారం వివిధ శాఖల అధికారులతో నూతన పీజీఆర్ఎస్ విధానంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఒకే సమస్యపై పదేపదే వచ్చే పునరావృత ఫిర్యాదులను సాంకేతిక వ్యవస్థ స్వయంచాలకంగా (ఆటోమేటిక్) గుర్తించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. గతంలో తీసుకున్న చర్యలు, అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అటువంటి ఫిర్యాదులకు దానంతట అదే సమాధానం ఇచ్చే విధానాన్ని అభివృద్ధి చేయాలన్నారు.…
నూతన విధానంపై అన్ని శాఖల అధికారులు పూర్తి అవగాహన పెంచుకొని, ఫిర్యాదుల పరిష్కారంలో దీనిని తప్పనిసరిగా అనుసరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పురపాలక శాఖ, డీఆర్డీఏ, పోలీసు, వ్యవసాయ, ఏపీఈపీడీసీఎల్, ఆర్డబ్ల్యూఎస్ తదితర శాఖల అధికారులతో ఆయన విడివిడిగా సమీక్షించారు. ఆయా శాఖలకు అందే అర్జీలలో పాతవి, కొత్తవి వేరుచేసి, పాత ఫిర్యాదు అయితే కంప్యూటర్ వ్యవస్థ ముందే గుర్తించి సమాచారం ఇచ్చేలా తీర్చిదిద్దుకోవాలని దిశానిర్దేశం చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)