Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఆర్టీసీ బస్సు స్టేషన్ల ఆధునీకరణ.. 86 చోట్ల రూ.20 కోట్లతో కొత్త హంగులు
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
The RTC management has decided to modernize 86 bus stations across the state where 5,000 passengers commute daily, allocating Rs.
20 crores for the project.
The modernization includes installing CCTV cameras connected to the central office, digital boards for bus schedules, and enhanced passenger amenities.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు స్టేషన్లను యాజమాన్యం నిర్ణయించింది. రైల్వే స్టేషన్ల మాదిరిగా ఆధునాతన హంగులతో తీర్చిదిద్దేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ మేరకు రాష్ట్రంలో నిత్యం 5 వేల మంది ప్రయాణీకులు రాకపోకలు సాగించే 86 బస్సుస్టేషన్లను గుర్తించిన అధికారులు.. ఇందుకోసం రూ.20 కోట్లను కేటాయించారు. ఈ నిధులతో ఆయా బస్సు స్టేషన్ లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కేంద్ర కార్యాలయానికి అనుసంధానిస్తారు.
ఫలితంగా బస్సు స్టేషన్లలో రద్దీ, అక్కడ జరిగే కార్యాకలాపాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు పర్యవేక్షించే వీలు కలుగుతుంది. బస్సు వేళలను తెలిపే డిజిటల్ బోర్డులు సైతం ఏర్పాటు చేస్తారు. బస్సుల టైం టేబుల్, రూట్వివరాలు డిస్ప్లే ద్వారా ప్రయాణికులు తెలుసుకునే వీలు కలుగుతుంది. ఇందుకోసం ప్రత్యేక అనౌన్స్ మెంట్లు చేయనున్నారు. జేబు దొంగలకు చెక్ పెట్టేందుకు ప్రత్యేక భద్రతా బలగాలను నియమిస్తారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)