Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఆర్టీసీ ఎన్నికల్లో రాష్ట్ర స్థాయిలో ఈయూ విజయం..రీజియన్లలో టీడబ్ల్యూయూకు మెజార్టీ స్థానాలు
By V6 Velugu||1 min read at V6 Velugu
In brief
Written by a model, not by V6 Velugu · not verifiedAI summary· Generated October 20, 2026
- The Employees Union (EU) won the state-level recognition in the RTC union elections, while the Telangana Workers Union (TWU) secured a majority of regional seats.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో రాష్ట్ర స్థాయిలో ఈయూ విజయం సాధించగా, రీజియన్ స్థాయిలో మాత్రం టీడబ్ల్యూయూ మెజార్టీ స్థానాలను గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 34,904 ఓటర్లుండగా 34,421 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 9 కార్మిక సంఘాలు పోటీ చేయగా అత్యధికంగా 18, 276 ఓట్లు సాధించిన ఎంప్లాయిస్ యూనియన్ (ఈయూ) రాష్ట్ర స్థాయి గుర్తింపు సంఘంగా నిలిచింది.
సెప్టెంబర్ 1 నుంచి రెండేళ్ల పాటు ఈ సంఘంకు ఈ హోదా ఉండనుంది. ఇక రీజియన్ స్థాయిలో మొత్తం 14 రీజియన్లు ఉండగా 9 రీజియన్లలో తెలంగాణ వర్కర్స్ యూనియన్( టీడబ్ల్యూయూ) కూటమి విజయం సాధించింది. ఇందులో ఖమ్మం, నల్గొండ, మెదక్, మహబూబ్ నగర్, వరంగల్, రంగారెడ్డి, కరీంనగర్ తో పాటు హైదరాబాద్, బస్ భవన్ రీజియన్లు ఉన్నాయి. ఇక నాన్ ఆపరేషన్ విభాగంలో ఉప్పల్, కరీంనగర్, ఎంజీబీఎస్, ఈడీ ఆఫీసు, బస్ భవన్ లో టీడబ్ల్యూయూ విజయం సాధించింది. గతంలో ఉన్న నిబంధనలను మార్చి, అధికార కాంగ్రెస్ కు అనుబంధంగా ఉన్న టీడబ్ల్యూయూకు మెజార్టీ రీజియన్లు దక్కేలా కార్మిక శాఖ అధికారులు చూపారని కొందరు కోర్టును ఆశ్రయించడం ఆర్టీసీ వర్గాల్లో…