Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఆర్టీసీ ప్రయాణాలపై కరువు ఎఫెక్ట్!
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో కరువు కారణంగా ఆర్టీసీ ప్రయాణికులకు తాగునీటి సరఫరా నిలిచిపోయిందని ఈ వ్యాసం నివేదిస్తోంది.
కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత, ముందుచూపు లేకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందని పేర్కొంటూ, ప్రయాణికులు ఇప్పటికే టికెట్ ధరలో నీటి చార్జీ చెల్లించినప్పటికీ బయట మళ్లీ డబ్బులు పెట్టి నీళ్లు కొనాల్సి వస్తోందని వివరించింది.
దాదాపు 20 రోజులుగా ఈ సమస్య కొనసాగుతున్నా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని ప్రయాణికులు ప్రశ్నిస్తూ, టికెట్‌లోని రూ.10 నీటి చార్జీని తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారని తెలిపింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వ వల్ల కరువు ప్రభావం ఆర్టీసీ ప్రయాణికులపై పడుతున్నది. ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతో ఇప్పటికే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలకు తాగునీటిలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతుండగా.. ఆ ప్రభావం ఇప్పుడు హైదరాబాద్, రంగారెడ్డి కేంద్రంగా నీళ్లు సరఫరా చేస్తున్న సంస్థలపైనా పడింది. ఈ నీటి కరువు ప్రభావాన్ని ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ప్రయాణికులు అనుభవిస్తున్నారు.
ఎందుకంటే ఆర్టీసీకి వాటర్‌ను సప్లయ్ చేస్తున్న ఫౌంటెన్ స్ప్రింగ్స్ సంస్థ రంగారెడ్డి జిల్లా కేంద్రంగా పనిచేస్తున్నది. దీనికి నీటి సరఫరా నిలిచిపోయిందని ఆర్టీసీ వర్గాల ద్వారా తెలిసింది. కరువు నేపథ్యంలో ఆర్టీసీకి సరఫరా అయ్యే నీటి విషయంలో ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోకపోవడంతో.. ఇప్పుడు ప్రయాణికులకు సప్లయ్ చేస్తున్న తాగునీరు (జీవా)పూర్తిగా నిలిచిపోయింది. ఈ తప్పును కప్పిపుచ్చుకొనేందుకు వాటర్ ప్లాంట్‌లో సాంకేతిక సమస్యలు వచ్చాయని చెప్తున్న ఉన్నతాధికారులు.. ఆ సమస్యను దాదాపు 20 రోజులు గడిచినా పరిష్కరించలేకపోయారా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)