Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ఆయనొక్కరే..
By Eenadu3 min read at Eenadu
In brief
చైత్రం దేవచంద్ పవార్ అనే వ్యక్తి మహారాష్ట్రలోని ధూలే జిల్లా బారిపాడా గ్రామంలో నీటి సంరక్షణ కోసం కృషి చేశారు.
ఆయన సొంత డబ్బుతో మొక్కలు నాటి, గ్రామస్థులతో కలిసి చెక్‌డ్యాంలు నిర్మించి, అటవీ విస్తీర్ణాన్ని పెంచారు.
ఆయన చేసిన కృషికి ప్రభుత్వం నిరుడు ‘పద్మశ్రీ’ పురస్కారంతో గౌరవించింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
జల వనరుల సంరక్షణ, నీటి పొదుపు గురించి ఎవరెన్ని చెప్పినా, ఆచరించేవారు అరుదుగానే కన్పిస్తారు. దాంతో ఏటా వేసవిలో చాలా ప్రాంతాలు నీటిఎద్దడికి గురవుతూ ఉండటం చూస్తూనే ఉంటాం. ఈ ఏడాది దానికి ఎల్‌నినో పరిస్థితులు కూడా తోడవడంతో నవంబరు నుంచే నీటి సమస్య గురించి మాట్లాడుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఎడారిలో ఒయాసిస్సులా కనిపిస్తుంటారు చైత్రం దేవచంద్ పవార్ లాంటి వాళ్లు.
మహారాష్ట్రలోని ధూలే జిల్లా సక్రి తాలూకాలోని మారుమూల గిరిజన గ్రామం- వెయ్యిలోపే జనాభా ఉన్న బారిపాడా. 1990 దశకంలో గ్రామం చుట్టుపక్కల అడవుల్లో చెట్లను విచక్షణారహితంగా కొట్టేయడంతో క్రమంగా పచ్చదనం కరవైంది. వర్షాలూ ముఖం చాటేశాయి. భూగర్భ జలాలు అడుగంటి బావులు ఎండిపోయాయి. గుక్కెడు నీటి కోసం అల్లాడిన ప్రజలు వలస వెళ్లడం ప్రారంభించారు. అప్పటికి ఉన్నత చదువులు పూర్తి చేసుకుని వచ్చిన చైత్రం దేవచంద్ పవార్ తన ఊరి దుస్థితిని చూసి చలించిపోయారు. నగరంలో మంచి ఉద్యోగావకాశాలు వచ్చినా వద్దనుకుని గ్రామం రూపురేఖలు మార్చాలని నిర్ణయించుకున్నారు. జల వనరుల సంరక్షణ పట్ల గ్రామస్థుల్లో చైతన్యం తేవడానికి ప్రయత్నాలు చేశారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)