Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Abhijeet Dipke | ‘నేను ఇక్కడే ఉన్నా, నన్ను అరెస్ట్ చేయండి’.. లుకౌట్ నోటీస్‌పై అభిజిత్ దిప్కే
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ముంబై పోలీసులు జారీ చేసిన లుకౌట్ నోటీస్‌పై స్పందిస్తూ, తాను సంవిధాన్ చౌక్‌లో ఉన్నానని, తనను అరెస్ట్ చేయాలని ఒక బహిరంగ కార్యక్రమంలో డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీజేపీ నేత అశుతోష్ రాంకా కూడా మాట్లాడుతూ, రాజ్యాంగాన్ని కాపాడుకోలేకపోతే దేశాన్ని కాపాడుకోలేమని ఆందోళన వ్యక్తం చేశారు.
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని అభిజిత్ దీప్కే ఆరోపించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
ముంబై: పోలీసులు లుకౌట్ నోటీస్ జారి చేయడంపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే స్పందించారు. ‘నేను ఇక్కడే ఉన్నా, నన్ను అరెస్ట్ చేయండి’ అని ఒక బహిరంగ కార్యక్రమంలో ఆయన అన్నారు. (Abhijeet Dipke) మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో1956లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బౌద్ధమతాన్ని స్వీకరించిన సంవిధాన్ చౌక్‌లో గురువారం ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, రాజ్యాంగాన్ని కాపాడండి’ అన్న పేరుతో నిరసన ర్యాలీని సీజేపీ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో అభిజిత్ దీప్కే ప్రసంగించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నదని ఆయన ఆరోపించారు. దేశంలోని ప్రతి సంస్థను…
కాగా, సీజేపీ నేతలపై ముంబై పోలీసులు జారీ చేసిన లుకౌట్ నోటీస్ గురించి అభిజిత్ దీప్కే మాట్లాడారు. ‘నాపై ముంబై పోలీసులు లుకౌట్ నోటీస్ జారీ చేశారు. ఇక్కడ పోలీస్ బందోబస్తు ఉన్నది. వారు నా కోసం వెతుకుతున్నారు. అభిజిత్ దీప్కే ఎక్కడా? నేను ఇక్కడే సంవిధాన్ చౌక్‌లో ఉన్నాను. మీరేం చేస్తారు? నన్ను అరెస్ట్ చేయండి. నేను రెండుసార్లు జైలుకు వెళ్లాను. నాకు జైలు భయాన్ని చూపించకండి’ అని అన్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)