Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
అగర్తల గడ్డపై ‘ఇండియా’ కూటమి శంఖారావం : సీఈసీ జ్ఞానేశ్ కుమార్
By V6 Velugu||1 min read at V6 Velugu
In brief
The 'India' alliance announced a major public rally in Agartala, Tripura, on October 30 to protest the central government's handling of the Special Intensive Revision (SIR) process.
Opposition leaders Jitendra Chowdhury and Ashish Kumar Saha stated the process is a conspiracy to disenfranchise voters and benefit the BJP.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అగర్తల: దేశంలో పౌరుల ఓటు హక్కును కాలరాసేలా కేంద్రం ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ‘ఇండియా’ కూటమి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇందులో భాగంగా త్రిపుర రాజధాని అగర్తల వేదికగా అక్టోబర్ 30న భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు కూటమి నాయకులు ప్రకటించారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలని, సర్పేరుతో ఓటర్ల జాబితా నుంచి తొలగించిన అర్హులందరికీ తిరిగి చోటు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు.
శనివారం అగర్తల ప్రెస్‌క్లబ్‌లో ప్రతిపక్ష నేత జితేంద్ర చౌధురి, త్రిపుర టీపీసీసీ అధ్యక్షుడు ఆశిష్ కుమార్ సాహా మీడియాతో మాట్లాడారు. సర్ ప్రక్రియ దేశాన్ని జాతీయ సంక్షోభం వైపు నడిపిస్తోందని జితేంద్ర చౌధురి మండిపడ్డారు. దేశవ్యాప్తంగా సర్ముసుగులో ఇప్పటివరకు 13 కోట్ల మందికి పైగా ఓటర్ల హక్కులను కాలరాశారని ఆరోపించారు. బీజేపీని గెలిపించే లక్ష్యంతోనే పీఎం మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు సీఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పశ్చిమ బెంగాల్, బిహార్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకే ఈ సర్కుట్రకు తెరలేపారన్నారు.
This is V6 Velugu’s reporting. Read it where it was published.
Read the full story at V6 Velugu (opens in a new tab)