Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Air Pollution: వాయు కాలుష్యం ఎఫెక్ట్.. మళ్లీ ఆంక్షల చట్రంలోకి దిల్లీ
By Eenadu||1 min read at Eenadu
In brief
The Central Air Quality Management (CAQM) has implemented GRAP-1 restrictions in Delhi-NCR for the first time this season due to a sharp deterioration in air quality.
The AQI in Delhi rose to 244 in the 'poor' category on Wednesday, and the CAQM has mandated the immediate ban of coal and firewood in hotels and restaurants, along with restricted diesel generator usage.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం (Delhi Pollution) మళ్లీ పడగ విప్పుతోంది. స్థానికంగా వాయు నాణ్యత సూచీ (AQI) దిగజారడంతో ‘సెంట్రల్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (CAQM)’ ఈ సీజన్లో తొలిసారి ఆంక్షలు విధించింది. దిల్లీ - ఎన్సీఆర్ పరిధిలో ‘గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్-1 (GRAP-1) నిబంధనలను తక్షణమే అమల్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సీఏక్యూఎం ఛైర్పర్సన్ రాజేశ్ వర్మ అధ్యక్షతన దిల్లీ ఉన్నతాధికారులు, పలు ప్రభుత్వ ఏజెన్సీలతో సమీక్షా సమావేశం జరిగింది. నగరంలో వాయు కాలుష్య సమస్యలను సమీక్షించడంతో పాటు రాబోయే రోజుల్లో కాలుష్య నివారణ చర్యల్ని బలోపేతం చేయడంపై చర్చించారు.
దిల్లీలో ఈ నెల 20న వాయు నాణ్యత సూచీ 179గా (మధ్యస్థ కేటగిరీ) నమోదు కాగా.. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు 244 (పూర్ కేటగిరీ)కి ఒక్కసారిగా పెరిగిందని సీఏక్యూఎం ఓ ప్రకటనలో పేర్కొంది. రాబోయే రోజుల్లో వాయు నాణ్యత సూచీ ‘పూర్’ కేటగిరీలోనే ఉంటుందని భారత వాతావరణ శాఖ, ఇతర సంస్థలు అంచనా వేసినట్లు తెలిపింది. వాయు నాణ్యత మరింతగా క్షీణించకుండా నిరోధించేందుకు జీఆర్ఏపీ-1 నిబంధనలను వెంటనే అమలు చేయాలని, ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా గ్రాప్-1 కింద హోటళ్లు, రెస్టారంట్లలో ఇంధనంగా బొగ్గు, వంట చెరకు వినియోగం నిషేధం, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే డీజిల్ జనరేటర్ల వాడకానికి అనుమతించడం…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)