Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
అక్టోబర్లో 95 శాతం లోటు వర్షపాతం
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
According to the article, Telangana received a 95% deficit in rainfall during the first three weeks of October, with 12 districts recording zero rainfall.
The article attributes this to El Niño and notes that officials are concerned about the impact on groundwater and crops.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ) : నైరుతి రుతుపవనాలు తిరోగమించే అక్టోబర్ నెలలో తెలంగాణలో అకడకడా వర్షాలు కురుస్తుంటాయి. హైదరాబాద్ నగరంలోనైతే కాస్త ఎకువగానే వానలు పడుతుంటాయి. 2020 అక్టోబర్లో భాగ్యనగరంలో ఏకంగా 400 మి.మీ. వర్షం కురిసింది. అయితే ఈసారి ఎల్ నినో కారణంగా పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. అక్టోబర్ తొలి మూడు వారాల్లో రాష్ట్రంలో ఏకంగా 95 శాతం వర్షపాతం నమోదైంది. 12 జిల్లాల్లో ఈ మూడు వారాల్లో చినుకు జాడ లేదు. మిగతా 21 జిల్లాల్లోనూ భారీ లోటు నమోదైంది.
సాధారణంగా అక్టోబర్ నెల తొలి మూడు వారాల్లో రాష్ట్రంలో 75.6 మి.మీ. వర్షం కురుస్తుంది. కానీ ఈసారి కేవలం 5.3 మిల్లీమీటర్ల వర్షమే కురిసింది. దీని ప్రభావం పంటలపై, భూగర్భ జలాలపై పడే అవకాశం కనిపిస్తున్నది. హనుమకొండ, జయశంకర్ భూపాపల్లి, జగిత్యాల, కరీంనగర్, మేడ్చల్-మలాజిగిరి, మంచిర్యాల, మెదక్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో ఈ 21 రోజుల్లో వర్షం చుక కూడా పడలేదు. ఎల్ నినో ప్రభావంతో ఎకువ రోజులపాటు వర్షం కురువకపోవడం వల్ల నేలలో తేమ స్థాయిలు తగ్గుతాయని, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నీటి లభ్యత తగ్గుతుందని అధికారులు ఆందోళన చెందుతున్నారు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)