Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
అండాల అక్రమ దందా
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
The Malkajgiri Commissioner stated that a court permitted police custody for eight arrested suspects in an illegal human egg smuggling case.
Police are examining the statements and medical histories of 31 identified women, and have issued notices to 14 fertility hospitals, IVF centers, and ART banks for records.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
మారేడ్‌పల్లి, నవంబర్ 11: మానవ అండాల అక్రమ రవాణా దందా కేసులో ఇప్పటికే అరెస్టయిన ఎనిమిది మంది నిందితులను ఈనెల 11 నుంచి 15 వరకు ఐదు రోజుల పాటు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించినట్లు మల్కాజిగిరి కమిషనర్ సుమతి బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. బేగంపేట పీఎస్‌లో నమోదైన కేసులో అమిత్ శర్మ, నిక్కత్ పర్వీన్, రేష్మా ఖాతూన్, మెఘావత్ శ్రీనివాస్ అలియాస్ సోను, ప్రదీప్, ఎస్కే. పర్వీన్, విజయ్ భగ్వాహ్ రావు సులుంకే, పంకజ్ పోనీలను విచారించనున్నట్లు తెలిపారు.
కాగా, బేగంపేట కేసుకు సంబంధించి మొత్తం 31 మంది మహిళలను గుర్తించిన పోలీసులు.. వారి వాంగ్మూలాలు, వైద్య చరిత్ర, గతంలో అండదానం చేసిన వివరాలు, సమ్మతి పత్రాలు వంటివి పరిశీలించనున్నారు. కొన్ని ఫెర్టిలిటీ కేంద్రాల్లో గతంలోనూ అండదానానికి సంబంధించిన రికార్డులు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. మొత్తం 14 ఫెర్టిలిటీ ఆస్పత్రులు, ఐవీఎఫ్ కేంద్రాలు, ఏఆర్టీ బ్యాంకులకు నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. కాగా, దర్యాప్తులో భాగంగా మరో నిందితుడు ప్రవీణ్‌ను అరెస్టు చేశారు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)