Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
అండాల దందాపై రిపోర్ట్ ఇవ్వండి..డీజీపీ, ముగ్గురు సీపీలకు మహిళా కమిషన్ నోటీసులు
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
The State Women's Commission took suo moto cognizance of news reports regarding the illegal trade of eggs involving young women from Telangana and other states.
Commission Secretary Padmaja Raman issued notices to the DGP and three Police Commissioners, ordering an investigation and a report into the alleged human trafficking and medical malpractice.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
హైదరాబాద్, వెలుగు: అండాల దందాపై రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన నిరుపేద, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న యువతులను ప్రలోభపెట్టి ఏజెంట్లు రంగారెడ్డి జిల్లా సరూర్నగర్, హైదరాబాద్జిల్లాలోని బేగంపేట్ ప్రాంతాలకు తీసుకొచ్చి, అండాలు సేకరిస్తున్న విషయమై పేపర్లు, టీవీల్లో వచ్చిన వార్తలను సుమోటోగా స్వీకరించింది. ఈ దారుణంపై విచారణ జరిపి, నివేదిక ఇవ్వాలని డీజీపీ, హైదరాబాద్, సైబరాబాద్, మేడ్చల్–మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్లకు మహిళా కమిషన్ కార్యదర్శి పద్మజారమణ మంగళవారం నోటీసులిచ్చారు.
యువతులకు ఇష్టానుసారంగా హార్మోన్ ఇంజెక్షన్లు ఇస్తూ, వైద్య నిబంధనలకు విరుద్ధంగా సర్జరీలు చేస్తూ వారి ప్రాణాలతోపాటు శారీరక, పునరుత్పత్తి ఆరోగ్యానికి తీవ్ర ముప్పు కలిగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ తరహా చర్యలను తీవ్రమైన మానవ అక్రమ రవాణాగా, మహిళల హక్కులు, గౌరవానికి భంగం కలిగించే అంశంగా కమిషన్ పరిగణించింది. ఈ ముఠాల వెనుక ప్రైవేట్ హాస్పిటల్స్, ఫెర్టిలిటీ సెంటర్లు, కొందరు డాక్టర్ల ప్రమేయం ఉన్నట్లు వస్తున్న ఆరోపణలపై లోతైన దర్యాప్తు చేయాలని ఆదేశించింది. ఇప్పటివరకు ఎంతమంది బాధితులను కాపాడారు, వారికి అందించిన వైద్య సాయం, పునరావాస వివరాలను తెలపాలని స్పష్టం చేసింది. నిందితులపై నమోదు చేసిన కేసులు…
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)