Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Andhra news: జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లు.. తుదిజాబితా ప్రకటించిన ఈసీ
By Eenadu2 min read at Eenadu
In brief
The State Election Commission released the final list of accepted nominations for ZPTC and MPTC positions across 28 districts in the state.
The commission confirmed that out of 51,902 MPTC and 5,724 ZPTC nominations filed, 46,045 and 4,770 respectively were found to be in order, while the rest were rejected.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
విజయవాడ: రాష్ట్రంలోని 28 జిల్లాల్లో పరిషత్ ఎన్నికలకు సంబంధించి ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్ల పరిశీలన అనంతరం తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. 9,829 ఎంపీటీసీ స్థానాలకు గానూ 46,045 నామినేషన్లు సరిగా ఉన్నాయని వెల్లడించింది. ఇందులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు 19,760 కాగా, వైకాపా 17,726 మంది, జనసేన 4,330, భాజపా 1049 మంది కాగా ఇండిపెండెంట్లు 2012 మంది ఉన్నారు. జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్న 659 స్థానాలకు గాను 4770 నామినేషన్లు సక్రమంగా ఉన్నాయని తేల్చింది. ఇందులో తెలుగుదేశం 1693, వైకాపా 1445 మంది, జనసేన 587, భాజపా 227 మంది కాగా ఇండిపెండెంట్లు 227 మంది ఉన్నారు.
జిల్లాల వారీ గణాంకాలు పరిశీలిస్తే జడ్పీటీసీలు ఎక్కువగా ఉన్న కడప జిల్లాలో 39 స్థానాలకు 215 మంది అభ్యర్థుల నామినేషన్లు సరిగా ఉన్నట్టు నిర్ధారించారు. అతి తక్కువ జడ్పీటీసీలు ఉన్న విశాఖ జిల్లాలో నాలుగు స్థానాలకు 46 నామినేషన్లు అర్హత సాధించాయి. అత్యధిక నామినేషన్లు తిరుపతి జిల్లాలోని 35 జడ్పీటీసీ స్థానాలకు 280 నామినేషన్లు ఆమోదం పొందాయి. రాష్ట్రంలో జడ్పీటీసీ స్థానాలకు 5,724 నామినేషన్లు దాఖలు కాగా, వాటిలో 4,770 నామినేషన్లలో అన్ని పత్రాలు సరిగా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. 954 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఎంపీటీసీలకు సంబంధించి 51,902 నామినేషన్లు దాఖలు కాగా, అందులో 46,045 నామినేషన్లు సరిగా…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)