Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Andhra Pradesh Local Body Elections: ఏపీలో పుర ఎన్నికలు.. ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ
By Eenadu||1 min read at Eenadu
In brief
Andhra Pradesh State Election Commission (SEC) Chief Anil Chandra Punetha is preparing a decision on the local body elections as a Supreme Court deadline approaches.
The article notes that the YSRCP has approached the Supreme Court over alleged interference with candidate nominations.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అమరావతి: ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల (Andhra Pradesh Local Body Elections) ప్రక్రియపై ఉత్కంఠ కొనసాగుతోంది. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు మరికొన్ని గంటల్లో ముగుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి నిర్ణయం తీసుకునేందుకు వీలుగా ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా (Anil Chandra Punetha) ఇప్పటికే కసరత్తు ముమ్మరం చేశారు. వివిధ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీల నుంచి నివేదికలు తెప్పించుకున్నారు. ఎన్నికల సంఘం కార్యదర్శి మల్లికార్జున, ఐజీ రాజకుమారితో సమీక్షలు నిర్వహించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇవ్వాల్సిన గడువు…
మిగిలిన ఎన్నికల షెడ్యూల్‌కు ఆటంకం లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై అనిల్‌చంద్ర పునేఠా కసరత్తు చేశారు. అంశాలవారీగా ఎస్ఈసీ నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. పలుచోట్ల నామినేషన్లు దాఖలు చేయనీయకుండా తమ అభ్యర్థులను అడ్డుకున్నారంటూ.. వైకాపా సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. 25వ తేదీ వరకు అభ్యర్థుల జాబితా ప్రకటన నిలిపివేసి.. ఫిర్యాదులపై గురువారం ఒక నిర్ణయం ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)