Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Andhra Pradesh: ఫేక్ వాట్సప్ ఛానల్.. వార్నింగ్ ఇచ్చిన పవన్ కార్యాలయం
By Eenadu||1 min read at Eenadu
In brief
[PUBLISHER] reported that the Deputy Chief Minister's Office of Andhra Pradesh clarified that an unofficial WhatsApp channel named 'Deputy CMO, Andhra Pradesh' is fake and has no connection to the office.
The Deputy CMO office issued an official statement on X warning the public not to trust or forward the channel's content, stating that legal action will be taken against those responsible for spreading misinformation.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు వాట్సప్ ఛానల్ నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ సీఎంవో కార్యాలయం వెల్లడించింది. ‘డిప్యూటీ సీఎంవో, ఆంధ్రప్రదేశ్’ పేరుతో కొనసాగుతున్న ఆ ఛానల్‌కు తమ కార్యాలయానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఉప ముఖ్యమంత్రి కార్యాలయం (Pawan kalyan) అధికారిక ప్రకటన విడుదల చేసింది.
కార్యాలయం గుర్తింపును దుర్వినియోగం చేస్తూ ఈ నకిలీ ఛానల్ ద్వారా తప్పుడు సమాచారాన్ని, సంబంధం లేని కంటెంట్‌ను ప్రచారం చేస్తున్నట్లు పేర్కొంది. ప్రభుత్వం పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపింది. ఇలాంటి చర్యలను ఏమాత్రం సహించబోమని స్పష్టం చేసింది. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ నకిలీ వాట్సప్ ఛానల్‌ను నమ్మొద్దని, అందులోని సమాచారాన్ని అనుసరించవద్దని, ఇతరులకు ఫార్వర్డ్ చేయవద్దని ప్రజలకు సూచించింది. ఇలాంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)