Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Anil Ambani: అనిల్ అంబానీ గ్రూప్‌పై ‘ఈడీ’ కొరడా.. రెండు చార్టర్డ్ విమానాలు అటాచ్
By Eenadu2 min read at Eenadu
In brief
According to the Enforcement Directorate (ED), the agency attached two chartered planes and assets worth Rs. 510 crore belonging to the Reliance Anil Ambani Group (RAAG) as part of a money laundering investigation.
The ED stated that the attachment was done under the Prevention of Money Laundering Act (PMLA) and alleged that the group misused funds from banks and financial institutions.
The agency also mentioned that it has arrested 10 people and filed six charge sheets in connection with the case.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్ డెస్క్: బ్యాంకింగ్ మోసానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా రిలయన్స్ అనిల్ అంబానీ గ్రూప్ (RAAG)పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) కొరడా ఝుళిపించింది. ఆ గ్రూప్‌నకు చెందిన రెండు చార్టర్డ్ విమానాలు సహా రూ.510 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఈ చర్యలు తీసుకున్నట్లు ఈడీ పేర్కొంది. రిలయన్స్ హోం ఫైనాన్స్ లిమిటెడ్ (RHFL)/రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్ (RCFL)కు సంబంధించి రూ.263.05 కోట్ల మోసం, రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (RCOM)కు సంబంధించి రూ.247.12 కోట్ల మోసం ఆరోపణలపై దర్యాప్తు…
‘‘రిలయన్స్ కమ్యూనికేషన్ కేసుకు సంబంధించి మహారాష్ట్రలో రెండు చార్టర్డ్ విమానాలు, ఆరు స్థలాలు, ఒక కార్యాలయ ప్రాంగణం తదితర ఆస్తులను అటాచ్ చేశాం. ఆర్హెచ్ఎఫ్ఎల్/ఆర్సీఎఫ్ఎల్ కేసుకు సంబంధించి తమిళనాడులోని రెండు విండ్మిల్లు, బ్యాంకు బ్యాలెన్స్‌లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, పెట్టుబడులను అటాచ్ చేశాం’’ అని ఈడీ తెలిపింది. రెండు చార్టర్డ్ విమానాల్లో ‘దసో ఫాల్కన్ 2000’, ఎంబ్రాయర్ ఉన్నాయి. తాజా ఉత్తర్వులతో కలిపి ఈ కేసులో ఇప్పటివరకు అటాచ్ చేసిన, స్వాధీనం చేసుకున్న మొత్తం ఆస్తుల విలువ రూ.23,100 కోట్లకు చేరింది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)