Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Anitha: ‘అర్నబ్’ను ఎదుర్కొనేందుకు పూర్తిస్థాయిలో యంత్రాంగం సిద్ధం: మంత్రి అనిత
By Eenadu1 min read at Eenadu
In brief
AP Home Minister Vangalapudi Anitha stated that the state machinery is fully prepared to face Cyclone Arnab, emphasizing the government's priority is to prevent loss of life.
She assured the public that the government stands by them and ordered various emergency teams to remain on 24-hour standby.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అమరావతి: ‘అర్నబ్’ తుపాను (Cyclone Arnab)ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) తెలిపారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ప్రాణనష్టం జరగకుండా చూడటమే ప్రభుత్వ ప్రాధాన్యమని చెప్పారు. విపత్తు నిర్వహణకు సంబంధించిన విభాగాలతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, పోలీసు, అగ్నిమాపక, రెవెన్యూ బృందాలు 24 గంటలూ అందుబాటులో ఉండాలని మంత్రి ఆదేశించారు. తీరప్రాంత ప్రజలను అవసరమైనప్పుడు వెంటనే తరలించేందుకు పునరావాస కేంద్రాలను సిద్ధంగా ఉంచాలని.. అక్కడ స్వచ్ఛమైన తాగునీరు, ఆహారం, వైద్య సదుపాయాలు కల్పించాలన్నారు. అత్యవసర సహాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థ టోల్‌ఫ్రీ నంబర్లు 1070, 112ను సంప్రదించాలని మంత్రి అనిత సూచించారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)