Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Annamalai | ‘12 ఏళ్లుగా అధికారంలో ఉన్నా, శతృవులను సృష్టించుకోవాల్సి వస్తున్నది’.. బీజేపీపై అన్నామలై విమర్శలు
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
K.
Annamalai, who resigned from the BJP in June, criticized the central government for creating enemies despite being in power for 12 years, specifically targeting the handling of 'Cockroach Janata Party' protests in Delhi.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
చెన్నై: తమిళనాడులో ఐదేళ్లపాటు బీజేపీకి నాయకత్వం వహించి ఆ పార్టీని వీడిన కే అన్నామలై కేంద్ర ప్రభుత్వంపై . 12 ఏళ్లుగా అధికారంలో ఉన్నా, ఇప్పటికీ శత్రువులను సృష్టించుకోవాల్సి వస్తోందని విమర్శించారు. (Annamalai) జూన్‌లో బీజేపీకి రాజీనామా చేసిన అన్నామలై, ‘వీ ద లీడర్స్’ అనే కొత్త సంస్థను ప్రారంభించారు. ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఆయన తప్పుపట్టారు. నిరసనకారులపై పోలీస్ బలగాలను ప్రయోగించడం, ముందస్తు నిర్బంధాలు, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను ఆయన విమర్శించారు.
కాగా, నిరసన తెలిపే హక్కును, ప్రభుత్వానికి వ్యతిరేక గళాలను ‘దేశ వ్యతిరేక’ చర్యలుగా చిత్రీకరించే ధోరణిని అన్నామలై ప్రశ్నించారు. ‘కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో 12 ఏళ్లకు పైగా అధికారంలో ఉందనే విషయాన్ని మరిచిపోయి, తమ ఉనికిని కాపాడుకోవడానికి నిరంతరం ఏదో ఒక శత్రువును సృష్టించుకుంటోందని నాకు అనిపిస్తోంది. ఇది చాలా బాధాకరం’ అని ఎక్స్‌లో వరుస పోస్టులతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)