Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Anti SIR: ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా ర్యాలీ.. దిల్లీలో ఉద్రిక్తత
By Eenadu||1 min read at Eenadu
In brief
Protesters in Delhi demonstrated against the Special Intensive Revision (SIR) of electoral rolls outside the Election Commission of India headquarters.
The demonstration, led by a coordination committee, turned tense as police intervened to stop protesters from entering the premises.
The article also notes the IAF's 94th anniversary celebrations at Namo Ghat in Varanasi.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
దిల్లీ: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)కు వ్యతిరేకంగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయానికి (ECI Headquarters) చేపట్టిన నిరసన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. దిల్లీ కో-ఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో నిరసనకారులు ఈసీఐ కార్యాలయం వైపు దూసుకెళ్లారు. జాతీయ జెండాలు, బ్యానర్లు చేతబట్టి.. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్కుమార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడంతో... వారంతా రోడ్డుపైనే బైఠాయించారు. ఎస్ఐఆర్ను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువకులు, రైతులతోపాటు సీపీఎం సీనియర్ నేత బృందా కారాట్, ఆల్ ఇండియా డెమొక్రాటిక్ విమెన్స్ అసోసియేషన్, ఆల్ ఇండియా డెమొక్రాటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ సభ్యులు ఈ నిరసనల్లో పాల్గొన్నారు. వీరితోపాటు దిల్లీ, హరియాణా, ఉత్తర్ప్రదేశ్ నుంచి పెద్ద సంఖ్యలో నిరసనకారులు ఆందోళనల్లో పాల్గొని తమ మద్దతు తెలియజేశారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు సెంట్రల్ దిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. రాపిడ్ యాక్షన్ ఫోర్స్ దళాలను రంగంలోకి దించారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)