Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
AP DGP: పోలీసుల సంయమనాన్ని బలహీనతగా భావించొద్దు: ఏపీ డీజీపీ
By Eenadu||2 min read at Eenadu
In brief
AP DGP Harish Kumar Gupta stated that police restraint should not be seen as weakness and announced that strict action will be taken against law violators and violence during local body elections.
The DGP's office also reported identifying 17 accused in 14 election-related incidents across 8 districts, including Guntur, Kadapa, Anantapur, and Nellore.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అమరావతి: పోలీసుల సంయమనాన్ని బలహీనతగా భావించొద్దని, నిష్పాక్షికంగా, కఠినంగా వ్యవహరిస్తామని ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఏపీ డీజీపీ కార్యాలయం కీలక ప్రకటన విడుదల చేసింది. ‘‘ఎన్నికల్లో చట్టబద్ధంగా పాల్గొనే ప్రతి ఒక్కరి హక్కుకు రక్షణ కల్పిస్తాం. మూక హింస, బెదిరింపులు, చట్టబద్ధమైన ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. 8 జిల్లాల్లో 14 ఎన్నికల ఘటనలపై కేసుల్లో 17 మంది నిందితులను గుర్తించాం. పల్నాడు, కడప జిల్లాల్లో మూడు చొప్పున.. అనంతపురం, నెల్లూరులో రెండు చొప్పున.. తిరుపతి, కర్నూలు, అన్నమయ్య, మార్కాపురం జిల్లాల్లో ఒక్కో ఘర్షణ కేసు నమోదయ్యాయి.
రాజకీయ పలుకుబడి ఉన్నంత మాత్రాన చట్టం నుంచి ఎవరికీ రక్షణ ఉండదు. అభ్యర్థులు నామినేషన్ కేంద్రాలకు చేరుకునేలా అధికారులు రక్షణ కల్పించాలి. సీసీటీవీలు, డ్రోన్ల ఆధారంగా అల్లరి మూకల గుర్తింపు ప్రక్రియ చేపట్టాలి. ఘటనాస్థలిలో లేకపోయినా.. హింసను ప్రేరేపించే నేతలపైనా చర్యలు తప్పవు. బైండోవర్ చర్యలు కేవలం శాంతిభద్రతల కోసమే. పోటీ చేసే అభ్యర్థుల అర్హతకు ఎలాంటి భంగం కలగదు. ప్రతి ప్రచార కార్యక్రమం, ర్యాలీ అనుమతులకు లోబడే జరగాలి’’ అని డీజీపీ స్పష్టం చేశారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)