Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
AP Investments | పెట్టుబడుల కోసం ఏపీ పెడదారి..‘గైడెన్స్ తమిళనాడు’ ఉదంతంతో తెలంగాణలోనూ కొత్త అనుమానాలు
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
తమిళనాడు ప్రభుత్వం 'గైడెన్స్ తమిళనాడు' లీక్ ఆరోపణలపై 15 మంది అధికారులను తొలగించగా, ఆ ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి మండలిలో చేరడం వివాదాస్పదమైంది.
ఈ ఉదంతం నేపథ్యంలో తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ అధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రంగారెడ్డి జిల్లాలో ప్రీమియర్ ఎనర్జీస్ పెట్టుబడిని వెనక్కి తీసుకుని నెల్లూరుకు తరలివెళ్లడం, సిగాచీ ఇండస్ట్రీస్ మరియు విరూపాక్ష ఆర్గానిక్స్ సంస్థలు కర్నూలుకు తరలిపోవడం వంటి సంఘటనలు తెలంగాణలో కొత్త ఆందోళనలకు దారితీశాయి.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
AP Investments | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ) : పొరుగు రాష్ర్టాలకు వచ్చే కంపెనీలను తమ వైపునకు తిప్పుకోవడానికి ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రబాబు ప్రభుత్వం పన్నుతున్నదా? ఇందుకోసం ఆయా పొరుగు రాష్ర్టాల్లో తమ మనుషులను నియమించిందా? తమిళనాడులో జరిగిన తాజా ఉదంతం ఈ అనుమానాలకు మరింత బలాన్నిస్తున్నది. తమిళనాడుకు రావాల్సిన పారిశ్రామిక పెట్టుబడుల రహస్య సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చేరవేస్తున్నారన్న ఆరోపణలతో 15 మంది అధికారులను ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ప్రభుత్వం తొలగించింది. తొలగించిన ఉద్యోగులు గత కొంతకాలంగా ‘గైడెన్స్ తమిళనాడు’ కంపెనీలో…
పెట్టుబడులను ఆకర్షించే ఉద్దేశంతో 1992లో అప్పటి తమిళనాడు ప్రభుత్వం ‘గైడెన్స్ తమిళనాడు’ పేరిట సంస్థను ఏర్పాటు చేసింది. రాష్ర్టంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్న కంపెనీలతో ప్రభుత్వం జరిపిన చర్చలు, పెట్టుబడి ప్రతిపాదనలకు సంబంధించిన వివరాలు ‘గైడెన్స్ తమిళనాడు’ డాటా బేస్‌లో ఉంటాయి. ఈ కీలక వివరాలు ఆంధ్రప్రదేశ్ అధికారులకు చేరాయన్న విషయం రాజకీయంగా సంచలనంగా మారింది. ‘గైడెన్స్ తమిళనాడు’ సంస్థ నుంచి ఉద్యోగాలు కోల్పోయిన వెంటనే క్రిస్టో లారెల్, ప్రభాకరన్ అండి, ప్రీజాప్రసాద్ అనే ముగ్గురు వ్యక్తులకు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి మండలిలో ఉద్యోగాలు దొరికినట్టు వార్తలు రావడం ఇప్పుడు మరింత…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)