Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
AP News | ఏపీకి మరో తుపాను ముప్పు.. భారీ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
The India Meteorological Department (IMD) warned that a cyclonic circulation has intensified into a cyclonic storm over the southeast Bay of Bengal, expected to approach the Andhra Pradesh coast by Monday evening.
Officials forecast heavy to very heavy rainfall in Central Andhra and Rayalaseema districts on Monday and Tuesday, accompanied by strong winds and rough seas.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
AP News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో తుపాను ముప్పు పొంచి ఉన్నది. ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసరాల్లోని అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారింది. ఇది రేపు (ఆదివారం) సాయంత్రానికి తుపానుగా రూపాంతరం చెందే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతున్న ఈ వాయుగుండం.. సోమవారం సాయంత్రానికి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలోకి చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ వాయుగుండం ప్రభావంతో ఏపీ అంతటా విస్తారంగా వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సోమ, మంగళవారాల్లో సెంట్రల్ ఆంధ్రా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను అప్రమత్తం చేసింది. తుపాను ప్రభావంతో తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని తెలిపింది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)