Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
[PUBLISHER] reported that five people died and several others were injured after gelatin sticks used for road construction exploded in Alluri Sitharama Raju district.
The driver of the tipper truck caused the truck to move forward without knowing the explosives were placed on the road, resulting in the explosion.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
AP News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగింది. రోడ్డు పనుల కోసం అమర్చిన జిలెటిన్ స్టిక్స్ పేలి ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. అనంతగిరి మండలం పినకోట వద్ద ఇవాళ (శనివారం) ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పనుల కోసం జిలెటిన్ స్టిక్స్ అమర్చిన విషయం తెలియక టిప్పర్ డ్రైవర్ వాహనాన్ని ముందుకు పోనిచ్చాడు. అదే సమయంలో జిలెటిన్ స్టిక్స్ పేలడంతో టిప్పర్ ఒక్కసారిగా ఎగిరిపడింది.
ఈ ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్, టిప్పర్‌లో ఉన్న ముగ్గురు కార్మికులు, ఒక టీచర్ ప్రాణాలు కోల్పోయారు. మరికొందరికి గాయాలయ్యాయి. గాయపడిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. రహదారి పనుల్లో భాగంగా కొండను తొలిచేందుకు రోడ్డు పనుల నిర్వాహకులు జిలెటిన్ స్టిక్స్‌ను పెట్టారు. కానీ అటువైపు ఎవరూ రాకుండా చూడటంతో నిర్లక్ష్యం వహించారు. ఆ నిర్లక్ష్యమే ఐదుగురి ప్రాణాలు తీసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక అధికారులు ఘటనా ప్రాంతానికి చేరకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)