Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
AP News | ముంచుకొస్తున్న ‘మురసు’.. ఏపీ సర్కారు అప్రమత్తం.. విద్యాసంస్థలకు సెలవు..!
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
The article reports that a severe cyclonic storm named 'Murasu' is approaching the Andhra Pradesh coast, prompting the state government to close educational institutions in several coastal districts.
According to the India Meteorological Department, the cyclone is expected to make landfall between Nellore and Narsapuram near Ongole between midnight on November 2 and dawn on November 3.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
AP News : ఆంధ్రప్రదేశ్ తీరంవైపు మురసు తుపాను ముంచుకొస్తున్నది. దాంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యగా కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. మంగళవారం స్కూళ్లు, కాలేజీలను మూసివేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లు అధికారికంగా ఆదేశాలు జారీచేశారు. భారత వాతావరణ కేంద్రం అంచనాల ప్రకారం.. ‘మురసు’ తీవ్ర తుపానుగా బలపడి, నవంబర్ 2 అర్ధరాత్రి నుంచి నవంబర్ 3న తెల్లవారుజాము వరకు నెల్లూరు–నర్సాపురం మధ్య ఒంగోలు సమీపంలో తీరందాటే అవకాశం ఉంది.
తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని, గరిష్ఠంగా 120 కిలోమీటర్ల వేగానికి చేరవచ్చని హెచ్చరించింది. ఈ హెచ్చరికల నేపథ్యంలో కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, ఏలూరు జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీలతోపాటు అంగన్వాడీ కేంద్రాలకు కూడా సెలవు వర్తిస్తుందని అధికారులు స్పష్టంచేశారు. తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీచేసింది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)