Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
AP News | రానున్న ఐదు రోజులు అప్రమత్తంగా ఉండండి.. అధికారులకు ఏపీ హోంమంత్రి ఆదేశం..!
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
[PUBLISHER] reported that the India Meteorological Department (IMD) warned of the potential for cyclone 'Arnab' to cause significant disruption in Andhra Pradesh.
AP Home Minister Anitha directed senior officials to maintain high alert levels for the next five days and ordered the removal of dangerous hoardings.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
AP News : ఏపీలో అర్నబ్ తుపాను సృష్టించే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఏపీ హోంమంత్రి అనిత సంబంధిత ఉన్నతాధికారులను ఆదేశించారు. రానున్న ఐదు రోజులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. సోమవారం నుంచి విస్తారంగా, మంగళ, బుధవారాల్లో కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. బుధవారం బాపట్ల-విశాఖ తీరాల మధ్య తుపాను తీరం దాటే సూచనలు ఉన్నాయని, ఆ సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని మంత్రి చెప్పారు.
తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, క్షేత్రస్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదకరంగా ఉన్న హోర్డింగులను వెంటనే తొలగించాలని హోంమంత్రి ఆదేశించారు. అవసరమైతే తీరప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని, బీచ్లలోకి పర్యాటకులను అనుమతించవద్దని అన్నారు. భారీ అలలు ఎగసిపడే ప్రాంతాల్లో సెల్ఫీలు తీసుకోవడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)