Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
AP News | వైఎస్ జగన్ ఒక క్రిమినల్ లిటిగెంట్.. రాజకీయాల్లో ఇలాంటి వాళ్లు ప్రమాదకరం : చంద్రబాబు
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
AP News reported that AP Chief Minister N.
Chandrababu Naidu held a teleconference with TDP members, calling YSR Congress Party president Y.S.
Jagan Mohan Reddy a 'criminal litigant' and accusing the YSRCP of obstructing development and the electoral process.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
AP News : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అభ్యర్థులు, బూత్ స్థాయి కార్యకర్తలతో బుధవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాజకీయాల్లో జగన్ లాంటి ‘క్రిమినల్ లిటిగెంట్లు’ ఉండటం అత్యంత ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. తానే విధ్వంసానికి పాల్పడి తానే కోర్టుకు వెళ్లే వికృత ఆలోచనలు జగన్‌కే వస్తాయని చంద్రబాబు విమర్శించారు.
వైసీపీని ‘గొడ్డలి పార్టీ’గా అభివర్ణిస్తూ.. అభివృద్ధిని, ఎన్నికలను అడ్డుకోవడమే ఆ పార్టీ పనిగా పెట్టుకుందని చంద్రబాబు మండిపడ్డారు. కేవలం స్థానిక ఎన్నికలనే కాకుండా మెగా డీఎస్సీ, అమరావతి, పోలవరం వంటి కీలక ప్రాజెక్టులను అడ్డుకునేందుకు వైసీపీ నేతలు వందల సంఖ్యలో పిటిషన్లు వేశారని ఆరోపించారు. ఓటరు జాబితా, బీసీ రిజర్వేషన్లపైనా కోర్టులకు వెళ్లి ఎన్నికల ప్రక్రియను అడ్డుకున్నారని గుర్తుచేశారు. స్థానిక ఎన్నికల్లో జనసేన, బీజేపీలతో సమన్వయం చేసుకుంటూ కూటమి అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా పనిచేయాలని చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)