Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
AP Rains | బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి.. ఏపీలో నాలుగురోజులు వర్షాలు..!
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ మాట్లాడుతూ, బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో మరో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు.
బుధవారం 14 జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన చెప్పారు.
నెల్లూరు జిల్లా కొండాపురంలో అత్యధికంగా 39.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని ప్రఖర్ జైన్ వెల్లడించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
AP Rains : బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో మరో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. రాష్ట్రంలో వాతావరణం మేఘావృతమై ఉండటంతోపాటు పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు. బుధవారం 14 జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో వానలు కురిసే ఛాన్స్ ఉందని ప్రఖర్ జైన్ చెప్పారు. శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మిగతా జిల్లాల్లోనూ చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్పారు. మెరుపులు, ఈదురుగాలులతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల కింద నిలబడవద్దని హెచ్చరించారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)